24 ఏళ్ల వయసులో నాపై గ్యాంగ్ రేప్... | Former ‘Bigg Boss’ contestant Sapna Bhavnani was gang-raped at 24 | Sakshi
Sakshi News home page

24 ఏళ్ల వయసులో నాపై గ్యాంగ్ రేప్...

Published Thu, Jul 9 2015 4:13 PM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM

24 ఏళ్ల వయసులో నాపై గ్యాంగ్ రేప్...

24 ఏళ్ల వయసులో నాపై గ్యాంగ్ రేప్...

చిత్ర విచిత్రమైన హెయిర్ స్టయిల్స్, హెయిర్ కలర్స్, టాటూస్తో పలువురిని ఆకట్టుకున్న హెయిర్ స్టయిలిస్ట్, బిగ్ బాస్ సీజన్ 6 పార్టిసిపెంట్ సప్నా భవాని ఇపుడు మళ్లీ వార్తల్లో నిలిచారు.

ముంబై:  చిత్ర విచిత్రమైన హెయిర్ స్టయిల్స్, హెయిర్ కలర్స్, టాటూస్తో పలువురిని ఆకట్టుకున్న హెయిర్ స్టయిలిస్ట్,  బిగ్ బాస్ సీజన్ 6  పార్టిసిపెంట్ సప్నా భవాని ఇపుడు మళ్లీ వార్తల్లో నిలిచారు. 24 ఏళ్ల వయసులో తనపై గ్యాంగ్ రేప్  జరిగిందనే విషయాన్ని ఇప్పుడు ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' ఫేస్బుక్ పేజీలో తన వ్యక్తిగత జీవితంలోని ఒక విషాద కథనాన్ని బుధవారం సాయంత్రం పోస్ట్ చేశారు.  జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా...వాటిని అధిగమించి ముందుకు సాగాలని మహిళా లోకానికి ఆమె పిలుపునిచ్చారు. దీంతో ఈ వార్త  సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆమె పోస్టింగ్ ఇలా సాగింది....

''చిన్నప్పుడు బాంద్రాలో బైక్ నడిపేదాన్ని.. సిగరెట్లు కాల్చేదాన్ని.. మద్యం తాగేదాన్ని.. అప్పుడు అందరూ నన్ను తిరుగుబోతు అని పిలిచేవారు.. ఎందుకు పిలిచేవారో నాకు అర్థం కాదు. కానీ ఇవన్నీ చేయడం వల్లే నాకు ఆ ముద్రపడిందదంటే నాకేమీ బాధగా లేదు...ఒకింత గర్వంగానే  ఉంటుంది. తండ్రి చనిపోయాక కొంతమంది సన్నిహితుల సహకారంతో షికాగో వెళ్లి అక్కడ సెటిలయ్యాను. అక్కడ క్రిస్మస్ సందర్భంగా ఒంటరిగా షికాగోలోని ఒక బార్కు వెళ్లాను. పొట్టి స్కర్ట్... పెదాలకు ఎర్రరంగు లిప్స్టిక్ ఉన్న నన్ను కొంతమంది దుండగులు తుపాకీతో బెదిరించి నాపై అత్యాచారం చేశారు. ఈ దుర్ఘటన నా మదిని ఎపుడూ తొలుస్తూనే ఉంటుంది...అంతమాత్రాన  విశ్వాసాన్ని కోల్పోలేదు.

ఒక్కోసారి నాకేనా ఇలా జరిగిందని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని విషయాలు మన  ప్రమేయం లేకుండా జరిగిపోతాయి. ఇన్నిరోజుల పాటు ఈ విషాదాన్ని నాలో నేను దిగమింగాను. అంతకుమించి నాకు వేరే ప్రత్యామ్నాయం లేదు.  ఇలాంటి విషయాలను బయటపెట్టలేని మహిళల బలహీనతకు ఇది సంకేతం కాదా? ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి వెల్లడించానికి నాకు 20 ఏళ్లు పట్టింది. కానీ ఇపుడు పరిస్థితులు మారాయి. ఇపుడిలాంటి వాటిపై  స్పందించాల్సిన అవసరం ఉంది'' అని ఆమె వ్యాఖ్యానించారు. ఇకముందు ఎవరూ అత్యాచారానికి గురికాకూడదు.. వారి శరీరాలను అమ్ముకునే దౌర్భాగ్యం రాకూడదని కోరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement