Sapna Bhavnani
-
'ఆ డాక్యుమెంటరీ తీయడం నా కల'
ముంబయి : ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ సప్నా భవ్నాని 'సింధుస్థాన్' పేరుతో తీస్తున్న డాక్యుమెంటరీ రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లోని 'సింధ్' రాష్ట్రానికి వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఆమె మంగళవారం కోరారు. 'ఇమ్రాన్ సార్ ! నేను సింధ్ పేరు మీద సింధుస్థాన్ అనే డాక్యుమెంటరీ తీస్తున్నాను. ఈ డాక్యుమెంటరీకి సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకునేందుకు సింధ్‌కు రావాలనుకున్నాను. అయితే రెండుసార్లు నా వీసా తిరస్కరణకు గురైంది. ఈ సినిమా చేయడం నా కల.. ఎలాగైనా ఈ డాక్యుమెంటరీని పూర్తి చేయడానికి మీరు సహృదయంతో ఆలోచించి నాకు అనుమతినిస్తారని ఆశిస్తున్నా’అని స్వప్నా భవ్నానీ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా ఆమె చేసిన ట్వీట్‌పై అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. సింధ్ చరిత్ర, సంసృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 'సింధుస్థాన్' డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంటుంది. -
#మీటూ : బిగ్ బిపై కూడా..?!
‘మీటూ’ ఉద్యమం దేశ వ్యాప్తంగా అలజడులు సృష్టిస్తోంది. బాలీవుడ్, దక్షిణాది అనే తేడా లేకుండా ఇప్పటికే పలువురు ప్రముఖులు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్టార్ హీరోలు కూడా బాధితులకు తమ మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘మీటూ మూవ్మెంట్’ పట్ల మొదట నోరు మెదపని బిగ్ బీ కూడా స్పందించారు. తన 76వ పుట్టిన రోజున సందర్భంగా అమితాబ్ ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడారు. ‘మీటూ’ గురించి ఆయన ట్విట్టర్లో స్పందించిన విషయం తెలిసిందే. అయితే ఈ ‘మీటూ ఉద్యమం’ ఇప్పుడు అమితాబ్ బచ్చన్‌ను కూడా ఇబ్బందుల్లో పడేసేలా కనిపిస్తోంది. అమితాబ్ చేసిన ట్వీట్‌పై బాలీవుడ్ హెయిర్ స్టైలిస్ట్ సప్నా భవ్నాని స్పందించారు. ‘ఇది చాలా పెద్ద అబద్ధం. సర్ మీరు నటించిన ‘పింక్’ సినిమా వచ్చింది, వెళ్లింది. అలానే అతి త్వరలోనే మీకున్న సామాజిక వేత్త అనే పేరు కూడా పోతుంది. త్వరలోనే మీకు సంబంధించిన నిజాలు బయటకొస్తాయి. నా ట్వీట్ చదివిన వెంటనే మీరు కంగారుగా గోళ్లు కొరుక్కుంటారని నమ్ముతున్నాను. కానీ మీరు కొరుక్కోవడానికి మీ గోళ్లు సరిపోవు’’ అని ట్వీట్ చేశారు. This has to be the biggest lie ever. Sir the film Pink has released and gone and your image of being an activist will soon too. Your truth will come out very soon. Hope you are biting your hands cuz nails will not be enough. @SrBachchan #Metoo #MeTooIndia #comeoutwomen https://t.co/gMQXoRtPW3 — Sapna Moti Bhavnani (@sapnabhavnani) October 11, 2018 అంతేకాక ‘బచ్చన్ లైంగిక వేధింపులకు సంబంధించి చాలా కథలు విన్నాను. ఆ స్త్రీలంతా తమకు జరిగిన అన్యాయాల గురించి మాట్లాడాలి. అతని హిపోక్రసికి ఇకనైనా ముగింపు పలకాలి’ అంటూ ట్వీట్ చేశారు. సప్నా ట్వీట్ చూసిన నెటిజన్లు అమితాబ్ గురించి ఏలాంటి ఆరోపణలు బయటపడతాయా అని ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. Have personally heard so many stories of Bachchan’s sexual misconduct and I I hope those women come out. His hypocrisy is sooooo tired. #Metoo #MeTooIndia https://t.co/2BpumLoYlF — Sapna Moti Bhavnani (@sapnabhavnani) October 11, 2018 -
24 ఏళ్ల వయసులో నాపై గ్యాంగ్ రేప్...
ముంబై: చిత్ర విచిత్రమైన హెయిర్ స్టయిల్స్, హెయిర్ కలర్స్, టాటూస్‌తో పలువురిని ఆకట్టుకున్న హెయిర్ స్టయిలిస్ట్, బిగ్ బాస్ సీజన్ 6 పార్టిసిపెంట్ సప్నా భవాని ఇపుడు మళ్లీ వార్తల్లో నిలిచారు. 24 ఏళ్ల వయసులో తనపై గ్యాంగ్ రేప్ జరిగిందనే విషయాన్ని ఇప్పుడు ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' ఫేస్బుక్ పేజీలో తన వ్యక్తిగత జీవితంలోని ఒక విషాద కథనాన్ని బుధవారం సాయంత్రం పోస్ట్ చేశారు. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా...వాటిని అధిగమించి ముందుకు సాగాలని మహిళా లోకానికి ఆమె పిలుపునిచ్చారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆమె పోస్టింగ్ ఇలా సాగింది.... ''చిన్నప్పుడు బాంద్రాలో బైక్ నడిపేదాన్ని.. సిగరెట్లు కాల్చేదాన్ని.. మద్యం తాగేదాన్ని.. అప్పుడు అందరూ నన్ను తిరుగుబోతు అని పిలిచేవారు.. ఎందుకు పిలిచేవారో నాకు అర్థం కాదు. కానీ ఇవన్నీ చేయడం వల్లే నాకు ఆ ముద్రపడిందదంటే నాకేమీ బాధగా లేదు...ఒకింత గర్వంగానే ఉంటుంది. తండ్రి చనిపోయాక కొంతమంది సన్నిహితుల సహకారంతో షికాగో వెళ్లి అక్కడ సెటిలయ్యాను. అక్కడ క్రిస్మస్ సందర్భంగా ఒంటరిగా షికాగోలోని ఒక బార్‌కు వెళ్లాను. పొట్టి స్కర్ట్... పెదాలకు ఎర్రరంగు లిప్‌స్టిక్ ఉన్న నన్ను కొంతమంది దుండగులు తుపాకీతో బెదిరించి నాపై అత్యాచారం చేశారు. ఈ దుర్ఘటన నా మదిని ఎపుడూ తొలుస్తూనే ఉంటుంది...అంతమాత్రాన విశ్వాసాన్ని కోల్పోలేదు. ఒక్కోసారి నాకేనా ఇలా జరిగిందని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని విషయాలు మన ప్రమేయం లేకుండా జరిగిపోతాయి. ఇన్నిరోజుల పాటు ఈ విషాదాన్ని నాలో నేను దిగమింగాను. అంతకుమించి నాకు వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇలాంటి విషయాలను బయటపెట్టలేని మహిళల బలహీనతకు ఇది సంకేతం కాదా? ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి వెల్లడించానికి నాకు 20 ఏళ్లు పట్టింది. కానీ ఇపుడు పరిస్థితులు మారాయి. ఇపుడిలాంటి వాటిపై స్పందించాల్సిన అవసరం ఉంది'' అని ఆమె వ్యాఖ్యానించారు. ఇకముందు ఎవరూ అత్యాచారానికి గురికాకూడదు.. వారి శరీరాలను అమ్ముకునే దౌర్భాగ్యం రాకూడదని కోరుకున్నారు.