#మీటూ : బిగ్‌ బిపై కూడా..?! | Sapna Bhavnani To Amitabh Bachchan On MeToo Movement | Sakshi
Sakshi News home page

#మీటూ : బిగ్‌ బిపై కూడా..?!

Published Sat, Oct 13 2018 9:47 AM | Last Updated on Sat, Oct 13 2018 6:39 PM

Sapna Bhavnani To Amitabh Bachchan On MeToo Movement - Sakshi

అమితాబ్‌ బచ్చన్‌ - సప్నా భవ్నాని

‘మీటూ’ ఉద్యమం దేశ వ్యాప్తంగా అలజడులు సృష్టిస్తోంది. బాలీవుడ్‌, దక్షిణాది అనే తేడా లేకుండా ఇప్పటికే పలువురు ప్రముఖులు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్టార్‌ హీరోలు కూడా బాధితులకు తమ మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘మీటూ మూవ్‌మెంట్‌’ పట్ల మొదట నోరు మెదపని బిగ్‌ బీ కూడా స్పందించారు.

తన 76వ పుట్టిన రోజున సందర్భంగా అమితాబ్‌ ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడారు. ‘మీటూ’ గురించి ఆయన ట్విట్టర్‌లో స్పందించిన విషయం తెలిసిందే. అయితే ఈ ‘మీటూ ఉద్యమం’ ఇప్పుడు అమితాబ్‌ బచ్చన్‌ను కూడా  ఇబ్బందుల్లో పడేసేలా కనిపిస్తోంది.

అమితాబ్‌ చేసిన ట్వీట్‌పై బాలీవుడ్‌ హెయిర్‌ స్టైలిస్ట్‌ సప్నా భవ్నాని స్పందించారు. ‘ఇది చాలా పెద్ద అబద్ధం. సర్‌ మీరు నటించిన ‘పింక్‌’  సినిమా వచ్చింది, వెళ్లింది. అలానే అతి త్వరలోనే మీకున్న సామాజిక వేత్త అనే పేరు కూడా పోతుంది. త్వరలోనే మీకు సంబంధించిన నిజాలు బయటకొస్తాయి. నా ట్వీట్‌ చదివిన వెంటనే మీరు కంగారుగా గోళ్లు కొరుక్కుంటారని నమ్ముతున్నాను. కానీ మీరు కొరుక్కోవడానికి మీ గోళ్లు సరిపోవు’’ అని ట్వీట్‌ చేశారు.

అంతేకాక ‘బచ్చన్‌ లైంగిక వేధింపులకు సంబంధించి చాలా కథలు విన్నాను. ఆ స్త్రీలంతా తమకు జరిగిన అన్యాయాల గురించి మాట్లాడాలి. అతని హిపోక్రసికి ఇకనైనా ముగింపు పలకాలి’ అంటూ ట్వీట్‌ చేశారు. సప్నా ట్వీట్‌ చూసిన నెటిజన్లు అమితాబ్‌ గురించి ఏలాంటి ఆరోపణలు బయటపడతాయా అని ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement