టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ జాబితాలో నాగార్జున- అమల జోడీకి ప్రత్యేకస్థానం ఉంటుంది. వీళ్లిద్దరు కలిసి అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన శివతో పాటు చాలా చిత్రాల్లో జంటగా నటించారు. అయితే ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట రియల్ లైఫ్‌లోనూ ఒక్కటయ్యారు. అయితే పెళ్లి తర్వాత అమల సినిమాలకు దూరమైంది. చాలా కాలం తర్వాత 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రం ద్వారా అమ్మ పాత్రలో కనిపించింది. ఆ మధ్య ‘ఒకే ఒక జీవితం’ చిత్రంలో శర్వానంద్‌కు తల్లిగా నటించింది. ఇలా కేవలం కొన్ని సెలెక్టివ్‌గా సినిమాలు మాత్రమే చేస్తూ అభిమానులకు దగ్గరవుతోంది. అయితే సెప్టెంబర్ 12న ఆమె బర్త్ డే సందర్భంగా అమల గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
(ఇది చదవండి: మరి ఇంత బోల్డ్ గానా?.. హీరోయిన్ పోస్ట్‌పై దారుణ కామెంట్స్!)
అమల కుటుంబం
అమల అక్కినేని తెలుగు సినిమాల్లో నటించడమే కాదు.. జంతు సంక్షేమ కార్యకర్త కూడా పనిచేస్తున్నారు. ఆమె అసలు పేరు అమల ముఖర్జీ కాగా.. తల్లి ఐర్లాండ్ దేశస్థురాలు కాగా.. తండ్రి బెంగాళీకి చెందినవారు. అమల పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించింది. ఆమె తండ్రి ఇండియన్ నేవీలో అధికారిగా పని చేశారు. అమల హైదరాబాద్‌లోని బ్లూ క్రాస్, జంతు హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే ప్రభుత్వేతర సంస్థ సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు.
అమల సినీ కెరీర్
అమల తొలిసారిగా రాజేందర్ దర్శకత్వం వహించిన మైథిలి ఎనై కథలి అనే తమిళ చిత్రంలో నటించింది . ఆ మూవీ సూపర్‌హిట్ కావడంతో 1987 లో విడుదలైన పుష్పక విమానంలో కమల్ హాసన్ సరసన అమల కీలక పాత్ర పోషించింది . అంతే కాకుండా 1991 మలయాళ చిత్రం ఉలడక్కమ్‌లో తన పాత్రకు ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది.
చినబాబుతో టాలీవుడ్ ఎంట్రీ
తెలుగులో అమల నటించిన తొలి చిత్రం చినబాబు. డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రంలో నాగార్జున హీరోగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి జూన్ 11, 1992న వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు 1994లో అక్కినేని అఖిల్ జన్మించారు. అయితే నాగార్జునను పెళ్లి చేసుకున్న తర్వాత అమల నటనకు స్వస్తి పలికింది. చాలా ఏళ్ల తర్వాత 2012లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే తెలుగు సినిమాలో కనిపించింది.
(ఇది చదవండి: పెళ్లయ్యాక కోడలిని చదవనిస్తారా?.. సరికొత్త కథనంతో 'మామగారు'!)
కోల్‌కతాలోని ఝాలాలో జన్మించిన అమల ఇవాళ 56వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. అమల 1986 నుంచి 1992 వరకు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. తెలుగులో చినబాబు, పుష్పక విమానం, శివ, ప్రేమ యుద్ధం, ఘర్షణ, నిర్ణయం, రాజా విక్రమార్క(చిరంజీవి), మనం, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, హై ప్రీస్టెస్ 2019 (వెబ్ సిరీస్), ఒకే ఒక జీవితంలో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment