ఐ లవ్యూ స్వీట్‌ హార్ట్.. : నాగార్జున | Nagarjuna Akkineni on Twitter: "I love you sweetheart ️ | Sakshi
Sakshi News home page

ఐ లవ్యూ స్వీట్‌ హార్ట్.. : నాగార్జున

Published Tue, Sep 12 2017 12:43 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Nagarjuna Akkineni on Twitter: "I love you sweetheart ️



నటి అక్కినేని అమల పుట్టిన రోజు సందర్భంగా నాగార్జున ఆమెకు సోషల్‌​ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 'ఐ లవ్యూ స్వీట్‌ హార్ట్‌.. నీతో కలిసి మరెన్నో సంవత్సరాలు ఇలాగే జీవించాలని కోరుకుంటున్నా.. హ్యాపీ బర్త్‌ డే' అంటూ ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశారు. 
 
కాగా అమల మంగళవారం 48 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. నటిగానే కాకుండా సమాజ సేవలో అమల తనవంతు కృషి చేస్తున్నారు. నాగార్జున, అమల1992 లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక ఆమె సినిమాలకు దూరమయ్యారు. చాలా కాలం తర్వాత 2012 లో వచ్చిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’  చిత్రంలో నటించారు. ఆ తర్వాత 2014 లో వచ్చిన 'మనం' సినిమాలో ఆమె ఓ సన్నివేశంలోనూ నటించారు.



ఈ ఏడాది మొదట్లో మలయాళ సినిమా కేరాఫ్ సైరాభానుతో మరోసారి నటిగా ప్రూవ్ చేసుకున్నారు. ఎక్కువ సమయం కుటుంబంతో పాటు సామాజిక కార్యక్రమాలకు కేటాయిస్తున్న అమల, మంచి క్యారెక్టర్ వస్తే నటించేందుకు రెడీ అంటున్నారు.
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement