పాలపిట్టను బంధించడం నేరం
హైదరాబాద్: దసరా పండుగ రోజు పాలపిట్టను చూస్తే శుభమని సంప్రదాయాన్ని పాటించడం మంచిదే అయినా మొక్కుకోసం వాటిని బంధించరాదని బ్లూ క్రాస్ అధ్యక్షురాలు అక్కినేని అమల అన్నారు.
సోమవారం జూబ్లీహిల్స్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఎనిమల్ వెల్ఫేర్ ట్రైనింగ్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ దసరా రోజున పాలపిట్టను బంధించి పంజరాల్లో పెట్టుకొని వ్యాపారాలు చేయడం చట్ట విరుద్ధమన్నారు. ఎక్కడైనా వీటిని బంధించినట్లు తెలిస్తే హెల్ప్‌లైన్ నంబర్లు 7674922044, 9849027601, 3298985, 9966629858 సమాచారం అందించాలన్నారు.