నాగార్జున పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా నటించిన చిత్రం వైల్డ్ డాగ్. ఇందులో కింగ్ నాగ్ డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో కనిపిస్తాడు. ఇటీవలే రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌పై అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో తనపై అభినందనలు కురిపించిన మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్‌బాబుల వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్లను సైతం సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అయితే నాగ్ భార్య అమల కూడా ఈ ట్రైలర్ చూసి నాగ్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోయిందట. దీంతో తన భర్తకు పది కిస్సులు, 10 హార్ట్ ఎమోజీలు, మరో 10 స్టార్లను వాట్సాప్‌లో పంపించిందట. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా వెల్లడించాడు.
కాగా నాగ్ ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నాడు. డేవిడ్ ఇస్మలోన్, శ్యామ్ కౌశిక్ పర్యవేక్షణలో ఫైటింగ్ సీన్లు ప్రాక్టీస్ చేశాడు. యదార్థ సన్నివేశాల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న వైల్డ్ డాగ్ సినిమాకు అహిషోర్ సల్మాన్ దర్శకత్వం వహిస్తుండగా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 2న రిలీజ్ కానుంది.
చదవండి: స్క్రీన్ షాట్లు షేర్ చేసినందుకు చాలా సంతోషం: నాగ్
Comments
Please login to add a commentAdd a comment