ఇండస్ట్రీ ఏదైనా సరే మంచి విజయాన్ని సాధించిన చిత్రాన్ని రీమేక్ చేయడం అంటే కత్తి మీద సామే అవుతుంది. ఇంతకు ముందు రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ''బిల్లా ' చిత్రాన్ని ఆ తరువాత అజిత్ హీరోగా రీమేక్ చేశారు. లక్కీగా ఆ చిత్రం సక్సెస్ అయ్యింది. అదే విధంగా రీమేక్ చేసిన కొన్ని చిత్రాలతో నిర్మాతల చేతులు కాలాయి. ఇకపోతే నటుడు కమలహాసన్ 1988లో కథానాయకుడిగా నటించిన చిత్రం 'సత్య'. ఇందులో అక్కినేని అమల హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రానికి సురేశ్‌కృష్ణ దర్శకత్వం వహిస్తే.. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కమల్ హాసన్ నిర్మించారు.
అప్పట్లో ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. కోలీవుడ్‌లో ఆ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. 'సత్య' చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. అందులోని పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇకపోతే సత్య చిత్రం అర్జున్ అనే హిందీ చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. కాగా కమలహాసన్ నటించిన సత్య చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఇందులో కమలహాసన్ పాత్రను నటుడు అశోక్‌సెల్వన్ పోషించనున్నట్లు తెలిసింది. కోలీవుడ్‌లో అశోక్‌సెల్వన్ వైవిధ్య భరిత కథా పాత్రలను ఎంపిక చేసుకుంటూ సక్సెస్‌ఫుల్ బాటలో పయనిస్తున్నాడు.
సత్య రీమేక్ కోసం ఆయన ప్రత్యేకంగా ఫొటో షూట్‌ను కూడా నిర్వహించినట్లు సమాచారం. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈయన ఇటీవల పోర్ తొళిల్, బ్లూస్టార్ వంటి చిత్రాల విజయాలతో మంచి ఖుషీగా ఉన్నారు. పోర్ తొళిల్ చిత్రం ఓటీటీ ద్వారా తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఈ చిత్రం తెలుగు వారిని కూడా మెప్పించింది. కాగా సత్య చిత్ర రీమేక్ ను పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా తెరకెక్కించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి అధికారికంగా తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment