హిందీ సినిమా చూసిన నాగార్జున, అమల | Nagarjuna saw 'Hamari Adhuri Kahani' with wife on anniversary | Sakshi
Sakshi News home page

హిందీ సినిమా చూసిన నాగార్జున, అమల

Published Fri, Jun 12 2015 5:53 PM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

హిందీ సినిమా చూసిన నాగార్జున, అమల - Sakshi

హిందీ సినిమా చూసిన నాగార్జున, అమల

హైదరాబాద్: తాను ప్రత్యేక పాత్రలో నటించిన 'హమారీ ఆధూరీ కహానీ' హిందీ సినిమాను తన భర్త అక్కినేని నాగార్జునతో కలిసి అక్కినేని అమల గురువారం వీక్షించారు. గురువారం వీరి పెళ్లిరోజు కూడా కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమా చూశారు. ఇమ్రాన్ హష్మీ, విద్యాబాలన్, రాజకుమార్ రావ్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాలో అమల కీలకపాత్ర పోషించారు. ఆమె కోసం హైదరాబాద్ లో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించినట్టు చిత్రవర్గాలు వెల్లడించాయి. అమల నటనను నాగార్జున ఎంతో మెచ్చుకున్నారని తెలిపాయి.

ఈ సినిమాలో ఇమ్రాన్ షహ్మీ తల్లిగా అమల నటించారు. తన సినిమాను నాగార్జున, అమల దంపతులు మెచ్చుకున్నారని దర్శకుడు మొహిత్ సూరి తెలిపారు. వారి ప్రశంస తనకు పెద్ద కాంప్లిమెంట్ అని పేర్కొన్నారు. 'హమారీ ఆధూరీ కహానీ'  శుక్రవారం విడుదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement