మలయాళంలో అమల | Amala plays lawyer in her comeback Malayalam film | Sakshi
Sakshi News home page

మలయాళంలో అమల

Published Sun, Aug 21 2016 7:14 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

మలయాళంలో అమల

మలయాళంలో అమల

దాదాపు 20 ఏళ్ల తరువాత మలయాళ తెరపై మెరవనున్నారు అక్కినేని అమల. చాలాకాలంగా తెరకు దూరంగా ఉంటున్న ఆమె.. శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ మలయాళ సినిమాలో అమల నటించనున్నారు.

నూతన దర్శకుడు ఆంటోనీ సోనీ సెబాస్టియన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'కేరాఫ్ సైరాబాను' చిత్రంలో అమలా కీలకమైన పాత్రలో కనిపిస్తారట. లాయర్గా నటించనున్నారని వినికిడి. సైరాబాను పాత్రను నటి మంజు వారియర్ పోషిస్తుంది. ఓ సాధారణ ముస్లిం గృహిణికి, ఆమె కుమారుడికి మధ్య ఉన్న అనుబంధమే చిత్ర కథనంగా తెలుస్తోంది. ఈ చిత్రం సెప్టెంబరులో సెట్స్ పైకి వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement