![Sai Dharam Tej Shows his Six Pack in Prathi Roju Pandage - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/14/sai-dha.jpg.webp?itok=eN33zGt7)
ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్.. రీసెంట్‌గా రామ్ సిక్స్ ప్యాక్ బాడీతో విలన్ల బెండు తీశారు. ఇంకా ఆరు పలకల దేహంతో కనిపించిన హీరోలు చాలామందే ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి సాయితేజ్ పేరు కూడా చేరబోతోంది. మారుతి దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ప్రతి రోజూ పండగే’. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటించారు. సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రధారులు. ఈ సినిమాలోని రెండు యాక్షన్ సీక్వెన్సెస్‌లో సాయి తేజ్ సిక్స్‌ప్యాక్ బాడీతో కనిపిస్తారు. ఆ రెండు ఫైట్స్‌లో హోమం నేపథ్యంలో వచ్చే ఫైట్ సీన్ ఒకటి. ఈ రెండు ఫైట్లు హైలైట్‌గా నిలుస్తాయట. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment