అదంతా సహజం | Raashi Khanna Comments on New Year Resolution | Sakshi
Sakshi News home page

అదంతా సహజం

Published Fri, Jan 3 2020 11:07 AM | Last Updated on Fri, Jan 3 2020 11:07 AM

Raashi Khanna Comments on New Year Resolution - Sakshi

సినిమా: అదంతా సహజం అంటోంది నటి రాశీఖన్నా. అనుభవాలు చాలా పాఠాలు నేర్పుతాయంటారు. తాద్వారా మార్పులు వస్తాయి. నటి రాశీఖన్నా ఇందుకు మినహాయింపు కాదట. ఈ హైదరాబాదీ బ్యూటీ బాలీవుడ్‌లో నటిగా ఎంట్రీ ఇచ్చినా, ఇప్పుడు తెలుగు, తమిళం అంటూ దక్షిణాది చిత్రాలతో బిజీగా ఉంది. ఇమైకా నొడిగళ్‌ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఈ అమ్మడికి ఇక్కడ వెంట వెంటనే నాలుగైదు అవకాశాలు వచ్చేశాయి. అలా అడంగమరు. సంఘ తమిళన్‌ వంటి చిత్రాల్లో నటించిన ఈ జాణ ఇక్కడ రాశి గల నటిగానే పేరు తెచ్చుకుంది. అయినా చేతిలో ఇప్పుడు ఒక్క తమిళ చిత్రం కూడా లేదు. బహుశా తెలుగులో అవకాశాలు వరుస కట్టడంతో తమిళ చిత్రాలకు గ్యాప్‌ ఇచ్చిందేమో.

తెలుగులో తను నటించిన ప్రతిరోజూ పండగే మంచి విజయాన్ని అందుకుంది. దీంతో మంచి జోరు మీదున్న రాశీఖన్నా నూతన సంవత్సరం సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఒక్కో రోజూ ఇంకా మంచి మనిషిగా మారడానికి ప్రయత్నించాలి. నిన్న కంటే నేడు ఇంకా కొంచెం ఎక్కువగా  శ్రమించాలి. అందుకోసం మనం మనతోనే పోటీ పడాలి. ఇప్పుడు నేనదే చేస్తున్నాను. నటిగా పరిచయమై 7 ఏళ్లు అయ్యింది. ఈ ఏడేళ్లలో వివిధ కథా పాత్రల్లో నటించాను. ఆ విధంగా తన జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నా నిర్ణయాలను కూడా చాలా మార్చుకున్నాను. అంతాగా నేను పోషించిన పాత్రలు నాపై ప్రభావం చూపాయి. నా ఆలోచనా పరిధి పెరిగింది. సినిమాల్లో జయాపజయాలు సహజం. ఇంతకు ముందు విమర్శనలపై ఎంటనే రియాక్ట్‌ అయ్యేదాన్ని. నా చిత్రాల అపజయాల గురించి ఎవరైనా విమర్వించినా, గాసిప్స్‌ రాసినా కోపం వచ్చేది. ఇప్పుడు అది పూర్తిగా తగ్గిపోయ్యింది. చాలా శాంతస్వభావిగా మారిపోయాను. నిన్నటి కంటే నేడు బాగుండాలని ప్రయత్నిస్తున్నాను.ఈ కొత్త సంవత్సరంలో నా ఈ ప్రయత్నం కొనసాగుతుంది. అని నటి రాశీఖన్నా పేర్కొంది. మొత్తం మీద తాను మారిన విషయాన్ని పక్కన పెడితే మాటల్లో మాత్రం బాగా పరిణితి చెందిందీ భామ అని అనిపిస్తోంది కదూ! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement