సాయిధరమ్‌ తేజ్‌ గారు.. కంగ్రాట్యులేషన్స్ : పవన్‌ | Pawan Kalyan congratulated To Sai dharam Tej For Success Of Pratiroju Panduga Roje Movie | Sakshi
Sakshi News home page

సాయిధరమ్‌ తేజ్‌ గారు.. కంగ్రాట్యులేషన్స్ : పవన్‌

Published Mon, Jan 13 2020 5:58 PM | Last Updated on Mon, Jan 13 2020 6:06 PM

Pawan Kalyan congratulated To Sai dharam Tej For Success Of Pratiroju Panduga Roje Movie - Sakshi

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ భారీ వసూళ్లను రాబడుతోంది. సాయిధరమ్ తేజ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలించింది. ఈ నేపథ్యంలో, సాయితేజ్ కు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.

(చదవండి : ప్రతిరోజూ పండుగే : మూవీ రివ్యూ)

‘ప్రతిరోజు పండగే చిత్రం గ్రాండ్ సక్సెస్ అయినందుకు శుభాభినందనలు. భవిష్యత్తులో నువ్వు నటించే సినిమాలు ఇలాగే మంచి సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నాను’ అంటూ పవన్ సందేశం పంపారు. దీనిపై సాయితేజ్ స్పందిస్తూ, మాటలు రావడం లేదని ట్వీట్ చేశాడు. థ్యాంక్స్ చెబితే అది చాలా చిన్నమాట అవుతుందని, ‘లవ్యూ పవన్ కల్యాణ్ మామ’ అంటూ ట్వీట్‌ చేశాడు.

అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్‌ 20న విడులైంది. సాయితేజ్‌కు జంటగా రాశిఖన్నా నటించింది. తమన్ సంగీతం అందించారు. సత్యరాజ్‌, రావు రమేశ్‌, విజయ్‌కుమార్‌, నరేశ్‌, ప్రభ ముఖ్యపాత్రల్లో నటించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement