సత్యరాజ్, సాయి తేజ్, రాశీ ఖన్నా, అల్లు అరవింద్, మారుతి, వంశీ, ‘బన్ని’ వాసు
‘‘సందేశాన్ని కూడా ఆహ్లాదకరంగా చెప్పే ప్రతిభ ఉన్న వ్యక్తి మారుతి. ఆడియ¯Œ ్స పల్స్ తెలిసిన డైరెక్టర్ తను. ‘ప్రతిరోజూ పండగే’ సినిమా పెద్ద హిట్ అవుతుందని మా యూనిట్ అంతా నమ్మకంగా ఉన్నాం. సాయితేజ్‌తో పాటు ఈ సినిమాలో నటించిన అందరూ బాగా చేశారు. యు.వి. క్రియేషన్స్ వంశీ, నేను కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. బన్నీ వాసు కష్టపడి నిర్మించాడు’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’.
అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్ని’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘ వాసు, మారుతి, యూవీ వంశీ కలిసి చేస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఈ చిత్ర కథను మారుతి మొదటిసారి నాకే చెప్పాడు.. బాగా నచ్చింది. ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం ‘శతమానం భవతి’ సినిమా అంత పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. సాయి తేజ్ మాట్లాడుతూ– ‘‘ఫ్యా¯Œ ్స ఉంటే మాకు ప్రతిరోజూ పండగే. నాకు ఎప్పుడూ అండగా నిలబడింది మెగా ఫ్యా¯Œ ్స. చిరంజీవిగారితో పాటు అభిమానుల ఆశీర్వాదాలు మా యూనిట్‌కి ఉండాలని కోరుకుంటున్నా.
సినిమా చూశాక ప్రేక్షకులు నిరుత్సాహ పడరనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘మా సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన నా టీమ్‌కి థ్యాంక్స్. తమన్ మంచి పాటలిచ్చాడు. ‘బన్ని’వాసు, ఎస్.కె.ఎన్, ఏలూరు శ్రీను సహకారం మరువలేనిది. చిరంజీవిగారికి కథ చెప్పినప్పుడు నచ్చింది.. ఈ చిత్రం ట్రైలర్ చూసిన ఆయన మెచ్చుకున్నారు’’ అన్నారు మారుతి. ‘‘గీతా ఆర్ట్స్‌లో చేయాలనే కోరిక ఈ సినిమాతో తీరింది’’ అన్నారు రాశీఖన్నా. ‘‘నా సెకండ్ ఇన్నింగ్స్‌లో వచ్చిన ఒక బెస్ట్ రోల్ ఈ సినిమాలో చేశాను’’ అన్నారు నటుడు నరేష్. ‘‘సాయి తేజ్ చాలా హార్డ్ వర్కర్. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లో ఉన్న లక్షణాలు అతనిలో ఉన్నాయి’’ అన్నారు నటుడు సత్యరాజ్. ఈ వేడుకలో ‘బన్ని’ వాసు, సహ నిర్మాత ఎస్.కె.ఎన్, నటుడు రావు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment