
పెద్ద బీర్ కొంటే.. చిన్న బీరు ఫ్రీ అని వంటివి ఆఫర్స్ ఇవ్వొచ్చుగా అంటూ హీరో సన్నీ నవీన్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఆర్‌కే సినీ టాకీస్ బ్యానర్‌పై రాజేశ్ కొండెపు నిర్మిస్తున్న 'మధుర వైన్స్' సినిమా ట్రైలర్ గురువారం విడుదలయ్యింది.
పెద్ద బీర్ కొంటే.. చిన్న బీరు ఫ్రీ అని వంటివి ఆఫర్స్ ఇవ్వొచ్చుగా అంటూ హీరో సన్నీ నవీన్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఆర్‌కే సినీ టాకీస్ బ్యానర్‌పై రాజేశ్ కొండెపు నిర్మిస్తున్న 'మధుర వైన్స్' సినిమా ట్రైలర్ గురువారం విడుదలయ్యింది. సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రలుగా నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను యువ నటుడు కార్తికేయ విడుదల చేశారు.
వినోదాత్మక ప్రేమ కథా చిత్రంగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. సినిమా అంతా ఎంటర్‌టైనింగ్‌గా ఆకట్టుకునేలా ఉందని ఈ సందర్భంగా కార్తికేయ తెలిపారు. మధుర వైన్స్‌కు.. తన ప్రేయసి మధురకు మధ్య ఉన్న సంబంధమే సినిమా కథ అని చిత్రబృందం తెలిపింది. మద్యానికి ప్రేమకు మధ్య సన్నిహిత సంబంధం ఉందని చెప్పే డైలాగ్స్ యువతను ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించింది. మోహన్ చారి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, వర ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు.