![dill raju launches guna 369 movie first song - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/12/Guna.jpg.webp?itok=YSFzWE8I)
అర్జున్, ‘దిల్’ రాజు, కార్తికేయ, అనిల్, ప్రవీణ
‘‘కమల్ హాసన్‌గారి ‘గుణ’, బాలకృష్ణగారి ‘ఆదిత్య 369’ సినిమాల టైటిల్స్‌లో సగం సగం కలిపి చక్కగా కథకు తగ్గట్టు ‘గుణ 369’ టైటిల్ కుదిరింది’’ అని ‘దిల్’ రాజు అన్నారు. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, అనఘ జంటగా నటించిన చిత్రం ‘గుణ 369’. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో అనిల్ కడియాల, తిరుమల రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలోని తొలిపాట ‘తొలి పరిచయమా.. తొలి పరవశమా ఇది’ ను నిర్మాత ‘దిల్’ రాజు రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ – ‘‘తొలి పరిచయమా...’ ఫీల్ గుడ్ సాంగ్‌లా ఉంది.
ఈ సినిమా ‘ఆర్‌ఎక్స్ 100’లా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఇదేదో వండి వార్చిన కథ కాదు. నిజంగా జరిగిన కథ. రియలిస్టిక్‌గా ఉంటుంది. ఇంతకు ముందు సిల్వర్‌స్క్రీన్ మీద ఇలాంటి కథ రాలేదు’’ అన్నారు అర్జున్ జంధ్యాల. ‘‘గోల్డెన్ హ్యాండ్ ‘దిల్’ రాజుగారితో బోణీ కొట్టినందుకు మా ఆల్బమ్‌కు తిరుగుండదని నమ్మకంగా ఉన్నాం. భరద్వాజ్ కంపోజిషన్, విశ్వనాథ్ సాహిత్యం, హరిహరన్‌గారి గాత్రం సంగీత ప్రియులను ఆకట్టుకునేలా ఉన్నాయి’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సత్య కిశోర్, శివ మల్లాల.
Comments
Please login to add a commentAdd a comment