హీరోనవుతా, నా పెళ్లికి చిరంజీవి వస్తారు.. విచిత్రంగా అదే జరిగింది: హీరో | Hero Karthikeya Shared Chiranjeevi Photo And Said His Childhood Memories | Sakshi
Sakshi News home page

Karthikeya: హీరోనవుతా, నా పెళ్లికి చిరంజీవి వస్తారు.. విచిత్రంగా అదే జరిగింది: హీరో

Published Wed, Nov 24 2021 1:10 PM | Last Updated on Wed, Nov 24 2021 1:43 PM

Hero Karthikeya Shared Chiranjeevi Photo And Said His Childhood Memories - Sakshi

యంగ్‌ హీరో కార్తికేయ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. తన ప్రియురాలు లొహితా రెడ్డిని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌ వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అరవింద్‌, తణికెళ్ల భరణి, అజయ్‌ భూపతి, పాయల్‌ రాజ్‌పుత్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

చదవండి: షాకింగ్‌ లుక్‌లో సహజనటి జయసుధ.. ఇంతగా మారిపోయారేంటి?

ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. కాగా కార్తీకేయ మెగాస్టార్‌కు పెద్ద అభిమాని అనే సంగతి తెలిసిందే. ఓ మూవీ ఈవెంట్‌లో చిరు పాటకు డ్యాన్స్‌ చేసిన కార్తీకేయ అనంతరం మాట్లాడుతూ.. చిరంజీవికి పెద్ద అభిమానినని, ఆయన తనకే కాదు ఈ తరం హీరోలందరి స్ఫూర్తి అంటూ చెప్పకొచ్చాడు. అలాగే చిరంజీవి గారిని కలవడం తన చిరకాల కలగా ఉండేదని చెప్పాడు. ఈ నేపథ్యంంలో తన పెళ్లికి చిరంజీవి రావడంతో కార్తీకేయ సంబరంలో మునిగితేలుతున్నాడు. ఈ పెళ్లిలో నూతన వధువరులను ఆశీర్వదిస్తున్న చిరు ఫొటోను షేర్‌ చేస్తూ తెగ మురిసిపోయాడు కార్తీకేయ.

చదవండి: ఈ చిన్నారి ఓ స్టార్‌ హీరోయిన్‌, మన అగ్ర హీరోలందరితో జతకట్టింది, ఎవరో గుర్తు పట్టారా?

ఈ సందర్భంగా కార్తీకేయ ఓ ఆసక్తిక సంఘటనను పంచుకున్నాడు. ‘చిన్నప్పుడు నేను తరచూ ఒక మాట అంటూ ఉండేవాడినట. నేను పెద్దయ్యాక హీరోను అవుతాను. నా పెళ్లికి చిరంజీవి కూడా వస్తారు అని అనేవాడినట. నేను అల అనడంతో మా నాన్నా నా అమాకపు మాటలకు మురిసిపోతూ సరే నాన్నా అంటూ నా భుజాలు తడుతుండేవారట. కానీ విధి ఎంత చిత్రమైనది.. నిజంగానే నేను హీరోనయ్యాను.. నా పెళ్లికి మెగాస్టార్ వచ్చారు. నా జీవితంలో నేను ఎప్పటికీ మరిచిపోలేని రోజు’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఆర్‌ఎక్స్‌ 100 మూవీతో హీరోగా పరిచమైన కార్తీకేయ ఆ తర్వాత గ్యాప్ లేకుండ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement