బాలరాజు కబుర్లు | karthikeya new movie chavu kaburu mellega | Sakshi
Sakshi News home page

బాలరాజు కబుర్లు

Published Mon, Dec 16 2019 12:54 AM | Last Updated on Mon, Dec 16 2019 12:54 AM

karthikeya new movie chavu kaburu mellega - Sakshi

కార్తికేయ

‘చావు కబురు చల్లగా’ చెబుతానంటున్నారు బస్తీ బాలరాజు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా నటించనున్న తాజా చిత్రానికి ‘చావు కబురు చల్లగా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాతో కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. ఇందులో బస్తీ బాలరాజు అనే పాత్రలో నటించబోతున్నారు కార్తికేయ. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఈ సినిమాను నిర్మించనున్నారు. సునీల్‌ రెడ్డి సహ–నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ‘‘ఓ కొత్త అంశంతో ప్రేక్షకులను అలరిస్తాం. ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement