దేవదాస్‌.. ఎంబీఏ గోల్డ్‌ మెడలిస్ట్‌ | Kartikeya new movie 90ML teaser to be released soon | Sakshi
Sakshi News home page

దేవదాస్‌.. ఎంబీఏ గోల్డ్‌ మెడలిస్ట్‌

Published Sat, Sep 21 2019 1:10 AM | Last Updated on Sat, Sep 21 2019 1:10 AM

Kartikeya new movie 90ML teaser to be released soon - Sakshi

కార్తికేయ

దేవదాస్‌ అంటే మనకు గుర్తొచ్చేది ‘చెలియ లేదు చెలిమి లేదు’ అంటూ ప్రేయసికి దూరమై, మద్యానికి బానిస అయిన ఏయన్నార్‌. ‘దేవదాస్‌’ సినిమాలో ఆయన అంత అద్భుతంగా నటించారు. ఇప్పుడు మనం మరో దేవదాస్‌ని చూడబోతున్నాం. ఈ దేవదాస్‌ ఎంబీఏ గోల్డ్‌ మెడలిస్ట్‌. సినిమా పేరు ‘90 ఎం.ఎల్‌’. కార్తికేయ హీరోగా రూపొందుతున్న చిత్రం ఇది. అశోక్‌ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్‌ రెడ్డి ఎర్ర దర్శకుడు.

శనివారం కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తున్నారు. ‘‘ఈ చిత్రంలో కార్తికేయ పాత్ర పేరు దేవదాస్‌. గోల్డ్‌ మెడలిస్ట్‌ అయిన దేవదాస్‌ ‘ఆథరైజ్డ్‌ డ్రింకర్‌’గా పాపులర్‌ కావడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? అనేది ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు శేఖర్‌ రెడ్డి. అశోక్‌ రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ – ‘‘కామన్‌ మేన్‌కి కూడా కనెక్ట్‌ అయ్యే విధంగా కాన్సెప్ట్‌ ఉంటుంది. అక్టోబర్‌ 7కి టాకీ పార్ట్‌ పూర్తవుతుంది. మూడు పాటలను యూరప్‌లో చిత్రీకరిస్తాం’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement