
Karthikeya Reveals About His Love Story With Lohitha: ఆర్‌ఎక్స్100 సినిమాతో యూత్‌లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో కార్తికేయ. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో అతి త్వరలోనే బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడు. ప్రేయసితో మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నాడు. ఈ సందర్భంగా తన లవ్‌స్టోరీపై కార్తికేయ చెప్పిన విశేషాలు..
'నిట్ వరంగల్‌లో 2010లో తొలిసారి లోహితను కలిశాను. 2012లో ప్రపోజ్ చేశాను. సంవత్సరం తర్వాత ఒప్పుకుంది. బీటెక్ చదువుతున్న రోజుల్లో ఓసారి లోహిత నాకు పంపిన మెసేజ్ కారణంగా మా ఇంట్లో బాగా గొడవ జరిగింది. అప్పుడు ఫ్రాంక్ అని అబద్దం చెప్పి ఆ సమయంలో తప్పించుకున్నా. ఆ తర్వాత నాకు మెసేజ్ చేసిన అమ్మాయి లోహితనే అని ఈ మధ్యే మా ఇంట్లో తెలిసింది.
మా ప్రేమ విషయం మూడు నెలల క్రితమే కుటుంబసభ్యులకు తెలిసిందే. లోహితను ప్రేమిస్తున్న విషయం తొలుత మా ఇంట్లోచెప్పా. ఆ తర్వాత ఆమె కుటుంబసభ్యులను ఒప్పించాం. మా మధ్య ఉన్న స్నేహం, ప్రేమ గురించి చాలా కాలంగా అందరికి తెలియడం వల్ల అర్థం చేసుకొని పెళ్లికి అంగీకరించారు. రాజా విక్రమార్క’ ప్రీ రిలీజ్ వేడుకలో లోహితకు ప్రపోజ్ చేసి, సర్‌ప్రైజ్ ఇచ్చాను. ఇన్ని రోజుల నుంచి తనతో ప్రేమలో ఉన్నా ఎప్పుడూ ప్రాపర్‌గా ప్రపోజ్ చేయలేదు. ఫోనులో ఇష్టమని చెప్పడం తప్ప ‘ఐ లవ్ యు’ అని చెప్పలేదు. జీవితాంతం మా ఇద్దరికీ ఓ అందమైన అనుభూతిగా ఉంటుందని ఆ వేదిక మీద ప్రపోజ్ చేశాను'అని కార్తికేయ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment