
Director Rajamouli Met Salman Khan In Mumbai: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ఆయన తనయుడు ఎస్‌ఎస్ కార్తికేయ నవంబర్ 19న ముబైలోని ఫిల్మ్ సిటీలో కనిపించారు. వారిద్దరూ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను కలుసుకున్నారు. వీరి సమావేశం కొన్ని గంటలపాటు సాగింది. అయితే ఈ నేపథ‍్యంలో సల్మాన్ ఖాన్, ఎస్‌ఎస్ రాజమౌళి కాంబోలో సినిమా రాబోతున్నట్లు గాసిప్ మొదలైంది. అయితే వారు ఏ విషయమై కలుసుక్నునారని అధికారికంగా ధ్రువీకరించలేదు. త్వరలో ఈ సమావేశం గురించి అధికారికంగా వెల్లడిస్తారాని సమాచారం.
పలు నివేదికల ప్రకారం రాజమౌళి, కార‍్తికేయ ముంబైలో సల్మాన్ ఖాన్‌ను కలిసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలే తండ్రి-కొడుకులు ఇద్దరూ నవ్వుతూ ఫోజిచ్చారు. అయితే వీరు కొత్త సినిమా కోసం చర్చించుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. సల్మాన్ ఖాన్ బజరంగీ భాయిజాన్ సినిమాను దర్శకత్వం చేసే అవకాశాన్ని కోల్పోయారు రాజమౌళి. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ హిందీ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఈ సమావేశం తర్వాత రాజమౌళి, సల్మాన్ త‍్వరలో సినిమా చేయనున్నారా ? అనే ప్రశ‍్నలు తలెత్తుతున్నాయి.
ఎస్‌ఎస్ రాజమౌళి తన రాబోయే భారీ బడ్జెట్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ (RRR) పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇందులో ప్రధాన పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పాన్ ఇండియాగా జనవరి 7, 2022న థియేటర్లలో విడుదల కానుంది. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి ఓ చిత్రం చేయనున్నారు. ఈ సినిమా భారీ స్థాయిలో ఉంటుందని ఇటీవల మహేశ్ బాబు తెలిపారు. అయితే మహేశ్ బాబు చిత్రం తర్వాత రాజమౌళి, సల్మాన్ ఖాన్‌ను డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment