![Chiranjeevi Movie Shooting With Salman Khan Started In February - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/22/salmangod.jpg.webp?itok=7CPjlW5O)
Chiranjeevi Movie Shooting With Salman Khan: బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నేరుగా ఓ తెలుగు చిత్రం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ కీలక పాత్ర చేయనున్నారు. మోహన్ లాల్ నటించిన మలయాళ మూవీ ‘లూసీఫర్’కి రీమేక్‌గా ‘గాడ్ ఫాదర్’ను తెరకెక్కిస్తున్నారు. ఈ ‘లూసీఫర్’లో పృథ్వీరాజ్ చేసిన కీలక పాత్రను తెలుగులో సల్మాన్ చేయనున్నట్లు సమాచారం. ‘అంతిమ్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఈ హీరో ‘గాడ్‌ఫాదర్’లో నటించనున్నట్లు స్పష్టం చేశారు కూడా. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్‌లోకి ఎంట్రీ ఇస్తారట సల్మాన్ ఖాన్.
చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్‌తో కూడా సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు సల్లూ భాయ్. అయితే ఈ సినిమాపై ఇంకా స్పష్టత రాలేదు. స్నేహానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే బాలీవుడ్ భాయిజాన్ లెక్కలేనన్నిసార్లు ఇతర హీరోల సినిమాల్లో గెస్ట్ అప్పీరెయన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ నటిస్తున్న 'పఠాన్'లోనూ, అలాగే మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కొత్త చిత్రం 'లాల్ సింగ్ చద్దా'లోనూ అతిథి పాత్రలో అలరించనున్నాడు.
ఇదీ చదవండి: 'ఆర్‌ఆర్‌ఆర్'పై బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ప్రశంసలు..
Comments
Please login to add a commentAdd a comment