List Of 20 Upcoming Movie Releases In OTT And Theatres On Nov 3rd Week 2022 - Sakshi
Sakshi News home page

OTT, Theatre Releases This Week: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో రాబోతున్న సినిమాలివే

Published Mon, Nov 14 2022 1:12 PM | Last Updated on Mon, Nov 21 2022 5:41 PM

This Week Theatres and OTT Movie Releases List - Sakshi

సినీ ప్రేక్షకులకు ఈ వారం మరింత వినోదం అందనుంది. మిమ్మల్ని అలరించేందుకు ప్రతి వారంలాగే కొత్త కొత్త చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారం ఓటీటీలో అగ్రహీరోల చిత్రాలు వచ్చేస్తున్నాయి. ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీకి రానున్న చిత్రాల వివరాలేంటో ఓ లుక్కేద్దాం పదండి.

భయపెట్టేందుకు సిద్ధమైన 'మసూద'..!: సీనియర్ నటి సంగీత, తిరువీర్, సాయికిరణ్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'మసూద'. హారర్ డ్రామా నేపథ్యంలో దర్శకుడు రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్‌ల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ తన మూడో చిత్రంగా ‘మసూద’ను ప్రకటించింది. ఈ చిత్రం ఈనెల 18న థియేటర్లలో విడుదల కానుంది.

మాస్‌ కథతో వస్తున్న‘గాలోడు’ సుధీర్, గెహ్నా సిప్పి జంటగా నటించిన చిత్రం ‘గాలోడు’. రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. 

ఉత్కంఠభరిత కథతో..:  ఎన్‌.రావన్‌రెడ్డి, శ్రీనిఖిత, అలంకృత షా, రవీంద్ర బొమ్మకంటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'అలిపిరికి అల్లంత దూరంలో'. ఈ చిత్రానికి ఫణి కల్యాణ్‌ సంగీతమందిస్తున్నారు. రెడ్డి రాజేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రమేశ్‌ దబ్బుగొట్టు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 18న థియేటర్లలో రిలీజ్ కానుంది.

విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ ప్రేమ కథ: శ్రీ ధనలక్ష్మీ మూవీస్‌ పతాకంపై బీసు చందర్‌ గౌడ్‌ నిర్మిస్తున్న ప్రేమ కథాచిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’. ఎం. వినయ్‌ బాబు దర్శకత్వంలో రణధీర్‌, నందినీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ భారీ బడ్జెట్‌ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా నవంబర్‌ 18న అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్దమవుతోంది. 

హిందీలో దృశ్యం-2..: అజయ్ దేవగణ్, శ్రియా శరన్, టబు ప్రధాన పాత్రల్లో హిందీలో తెరకెక్కుతున్న చిత్రం 'దృశ్యం-2'. మ‌లయాళంలో సూప‌ర్ హిట్ మూవీ దృశ్యానికి సీక్వెల్‌గా వస్తోంది. ఇప్ప‌టికే తెలుగు, త‌మిళం, హిందీ భాషల్లో విడుద‌లై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి అభిషేక్ పాఠ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా ఈనెల 18న థియేటర్లలో సందడి చేయనుంది. 

ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే

మెగాస్టార్  ‘గాడ్‌ఫాదర్‌’: మెగాస్టార్‌ చిరంజీవి నటించిన లేటెస్ట్‌ మూవీ గాడ్‌ ఫాదర్‌. మలయాళ మూవీ లూసీఫర్ రీమేక్‏గా తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దసరా సందర్భంగా అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాడ్‌ ఫాదర్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈనెల 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. 

రాజ్‌తరుణ్‌ 'పెళ్లి సందడి': రాజ్‌ తరుణ్‌, శివానీ రాజశేఖర్‌ జంటగా నటించిన వెబ్‌సిరీస్‌ అహ నా పెళ్లంట. ఏబీసీడీకి దర్శకత్వం వహించిన సంజీవరెడ్డి  ఈ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించగా, రాహుల్‌ తమడ, సాయిదీప్‌ రెడ్డి బొర్రా నిర్మించారు. రొమాంటిక్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌ నవంబర్‌ 17న జీ 5లో స్ట్రీమింగ్‌ కానుంది.

ఓటీటీకి కార్తి థ్రిల్లర్‌ మూవీ: కార్తీ హీరోగా, రాశీ ఖన్నా, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం సర్దార్‌. వాటర్‌ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వం వహించాడు. అక్టోబర్‌ 21న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈనెల 18 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. 

మరికొన్ని హాలీవుడ్ చిత్రాలు /వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

  •     ది వండర్‌ (హాలీవుడ్‌) నవంబరు 16
  •     1899 (హాలీవుడ్‌)  నవంబరు 17
  •     రిటర్న్‌ టు క్రిస్మస్‌ క్రీక్‌ (హాలీవుడ్‌) నవంబరు 17
  •     ఇలైట్‌ (హాలీవుడ్‌) నవంబరు 18
  •     స్లంబర్‌ల్యాండ్‌( హాలీవుడ్‌) నవంబరు 18

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  •      హాస్టల్‌డేజ్‌ సీజన్‌-3 (వెబ్‌సిరీస్‌-హిందీ)  నవంబరు 16
  •     ది సెక్స్‌లైవ్స్‌ ఆఫ్‌ కాలేజ్‌గర్ల్స్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 18

డిస్నీ+హాట్‌స్టార్‌

  •     ఇరవతం (తమిళ్‌/తెలుగు) నవంబరు 17
  •     సీతారామం (తమిళ్‌) నవంబరు 18

సోనీ లివ్‌

  •     అనల్‌ మీలే పని తులి (తమిళ్‌) నవంబరు 18
  •     వండర్‌ ఉమెన్‌ (తెలుగు) నవంబరు 18

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement