Sardar Movie
-
సర్ధార్‌తో పాటు ఢిల్లీ ఎప్పుడు వస్తారంటే..
నటనకు విరామం లేకుండా దూసుకుపోతున్న నటుడు కార్తీ. 2007లో తన తొలి చిత్రం పరుత్తివీరన్తోనే ఛాలెంజ్‌తో కూడిన పాత్రతో కథానాకుడిగా ఎంట్రీ ఇచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నటుడు కార్తీ. ఇటీవల నటించిన సర్ధార్ చిత్రం వరకు ఈయన నటనా జర్నీ చూస్తే 99 శాతం విజయాలే. ప్రస్తుతం 'జపాన్' అనే మరో వైవిధ్యమైన పాత్రతో తన విలక్షణ నటనతో దీపావళి పండుగకు సందడి చేయడానికి సిద్ధం అవుతున్నారు. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ది వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఇది కార్తీ నటిస్తున్న 25వ చిత్రం కావడం గమనార్హం. కాగా ప్రస్తుతం తన 26వ చిత్రాన్ని నలన్ కుమారసామి దర్శకత్వంలో చేస్తున్న కార్తీ.. మరిన్ని కొత్త ప్రాజెక్ట్‌లు ఆయనచేతిలో ఉన్నాయి. అందులో సర్ధార్ –2, ఖైదీ 2 చిత్రాలు ముఖ్యమైనవి. కాగా ఖైదీ 2 చిత్రం గురించి దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇటీవల అధికారికంగానే చెప్పారు. రజనీకాంత్‌తో చేసే చిత్రం తరువాత ఖైదీ 2 మొదలవుతుందని ఆయన చెప్పారు. ఈ రకంగా ఢిల్లీని (ఖైదీలో కార్తీ పేరు) చూడాలాంటే 2025 వరకు ఆగాల్సిందే. కాగా తాజాగా సర్ధార్ 2 చిత్రం గురించి నటుడు కార్తీ అప్ డేట్ ఇచ్చారు. ఆయన తన ఇన్ స్ట్రాగామ్‌లో సర్ధార్ చిత్రం విడుదలై ఏడాది పూర్తి అయ్యిందని, త్వరలో సర్ధార్ – 2కు రెడీ అవుతున్నట్లు కార్తీ పేర్కొన్నారు. కాగా సర్ధార్ చిత్రాన్ని రూపొందించిన ప్రినన్స్ పిక్చర్స్ సంస్థనే దాని సీక్వెల్‌ను రూపొందించడానికి సన్నాహాలు చేస్తుండడం గమనార్హం. ఈ సినిమా 2024లో విడుదల కానుంది. ఈ భారీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
ఈ వారంలో థియేటర్లు, ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే
సినీ ప్రేక్షకులకు ఈ వారం మరింత వినోదం అందనుంది. మిమ్మల్ని అలరించేందుకు ప్రతి వారంలాగే కొత్త కొత్త చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారం ఓటీటీలో అగ్రహీరోల చిత్రాలు వచ్చేస్తున్నాయి. ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీకి రానున్న చిత్రాల వివరాలేంటో ఓ లుక్కేద్దాం పదండి. భయపెట్టేందుకు సిద్ధమైన 'మసూద'..!: సీనియర్ నటి సంగీత, తిరువీర్, సాయికిరణ్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'మసూద'. హారర్ డ్రామా నేపథ్యంలో దర్శకుడు రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్బస్టర్ల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ తన మూడో చిత్రంగా ‘మసూద’ను ప్రకటించింది. ఈ చిత్రం ఈనెల 18న థియేటర్లలో విడుదల కానుంది. మాస్ కథతో వస్తున్న‘గాలోడు’ సుధీర్, గెహ్నా సిప్పి జంటగా నటించిన చిత్రం ‘గాలోడు’. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఉత్కంఠభరిత కథతో..: ఎన్.రావన్‌రెడ్డి, శ్రీనిఖిత, అలంకృత షా, రవీంద్ర బొమ్మకంటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'అలిపిరికి అల్లంత దూరంలో'. ఈ చిత్రానికి ఫణి కల్యాణ్ సంగీతమందిస్తున్నారు. రెడ్డి రాజేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రమేశ్ దబ్బుగొట్టు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 18న థియేటర్లలో రిలీజ్ కానుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ ప్రేమ కథ: శ్రీ ధనలక్ష్మీ మూవీస్ పతాకంపై బీసు చందర్ గౌడ్ నిర్మిస్తున్న ప్రేమ కథాచిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’. ఎం. వినయ్ బాబు దర్శకత్వంలో రణధీర్, నందినీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 18న అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్దమవుతోంది. హిందీలో దృశ్యం-2..: అజయ్ దేవగణ్, శ్రియా శరన్, టబు ప్రధాన పాత్రల్లో హిందీలో తెరకెక్కుతున్న చిత్రం 'దృశ్యం-2'. మలయాళంలో సూపర్ హిట్ మూవీ దృశ్యానికి సీక్వెల్‌గా వస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించగా ఈనెల 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే మెగాస్టార్ ‘గాడ్‌ఫాదర్’: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. మలయాళ మూవీ లూసీఫర్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈనెల 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. రాజ్‌తరుణ్ 'పెళ్లి సందడి': రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన వెబ్‌సిరీస్ అహ నా పెళ్లంట. ఏబీసీడీకి దర్శకత్వం వహించిన సంజీవరెడ్డి ఈ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించగా, రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బొర్రా నిర్మించారు. రొమాంటిక్ కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ నవంబర్ 17న జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీకి కార్తి థ్రిల్లర్ మూవీ: కార్తీ హీరోగా, రాశీ ఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం సర్దార్. వాటర్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 21న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈనెల 18 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మరికొన్ని హాలీవుడ్ చిత్రాలు /వెబ్‌సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్ ది వండర్ (హాలీవుడ్) నవంబరు 16 1899 (హాలీవుడ్) నవంబరు 17 రిటర్న్ టు క్రిస్మస్ క్రీక్ (హాలీవుడ్) నవంబరు 17 ఇలైట్ (హాలీవుడ్) నవంబరు 18 స్లంబర్‌ల్యాండ్( హాలీవుడ్) నవంబరు 18 అమెజాన్ ప్రైమ్ వీడియో హాస్టల్‌డేజ్ సీజన్-3 (వెబ్‌సిరీస్-హిందీ) నవంబరు 16 ది సెక్స్‌లైవ్స్ ఆఫ్ కాలేజ్‌గర్ల్స్ (వెబ్‌సిరీస్) నవంబరు 18 డిస్నీ+హాట్‌స్టార్ ఇరవతం (తమిళ్/తెలుగు) నవంబరు 17 సీతారామం (తమిళ్) నవంబరు 18 సోనీ లివ్ అనల్ మీలే పని తులి (తమిళ్) నవంబరు 18 వండర్ ఉమెన్ (తెలుగు) నవంబరు 18 -
ఓటీటీలో కార్తీ బ్లాక్ బస్టర్ మూవీ 'సర్దార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
కార్తీ హీరోగా, రాశీ ఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం సర్దార్. వాటర్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 21న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కార్తీ కెరీర్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లతో బెస్ట్ మూవీగా నిలిచింది. టాలీవుడ్‌లోనూ భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రానికి సంబంధించిన తాజాగా ఓటీటీ రిలీజ్ అప్డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సంస్థ ఆహా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. (చదవండి: సర్దార్ హిట్.. దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్, ఫొటో వైరల్) దాదాపు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న మూవీ ఈ నెలలోనే ఓటీటీలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ఆహా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆహాలో నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం మందించారు. ఈ చిత్రంలో రజీషా విజయన్, చుంకీ పాండే, లైలా కీలక పాత్రల్లో నటించారు. అసలు కథేంటంటే: ‘ఒకానొక సమయంలో ఓ ఘోస్ట్ ఉండేది.. కానీ అది ఇక అబద్దం కాదు’ అనే దాన్ని బేస్ చేసుకుని, అలాంటి కాన్సెప్ట్ చుట్టూ తిరిగేలా ‘సర్దార్’ సినిమాను తెరకెక్కించారు. విజయ్ ప్రకాష్ (కార్తి) పబ్లిసిటీ తెచ్చుకోవాలని పాకులాడే ఓ పోలీస్ ఆఫీసర్. కనిపించకుండా పోయిన తన తండ్రి కారణంగా దేశ ద్రోహి కొడుకు అనే భారాన్ని మోస్తుంటాడు. తనని ఆ భయం వెంటాడుతుంటుంది. సమీర (లైలా) అనే సామాజిక కార్యకర్త నీటి వనరులను ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం సాగిస్తుంటుంది. విజయ్ ప్రకాష్ దేశాన్ని ప్రమాదంలో పడేసే అబద్ధాలు, మోసానికి సంబంధించిన ఇబ్బందికరమైన వెబ్‌కి సంబంధించి వివరాలను సేకరించటం కోసం హంతకులను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ప్రమాదకరమైన, దుష్టుడైన బిజినెస్ మేన్ రాథోడ్ (చుంకీ పాండే)ని, అతని నీచమైన ప్రణాళికలను ఆపగలిగే ఏకైక వ్యక్తి.. విజయ్ కార్తీక్ తండ్రి సూపర్ స్పై అజ్ఞాతంలో ఉంటాడు. అతను ఏం చేశాడనేదే సినిమా.' థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి. -
సర్దార్ హిట్.. దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్, ఫొటో వైరల్
కార్తీ హీరోగా, రాశీ ఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం సర్దార్. వాటర్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 21న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సంతోషంలో నిర్మాత సర్దార్ డైరెక్టర్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. సర్దార్ నిర్మాత ప్రిన్స్ పిక్చర్స్ అధినేత ఎస్. లక్ష్మణ్ డైరెక్టర్ పీఎస్ మిత్రన్ కోసం ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. హీరో కార్తీ చేతుల మీదుగా దాన్ని పీఎస్ మిత్రన్‌కు అందించాడు. ఈ కారు ధర రూ.32 లక్షలపైనే ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారాయి. ఇకపోతే సర్దార్ సినిమాలో కార్తీ.. చంద్రబోస్ అలియాస్ సర్దార్, ఆయన తనయుడు ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాశ్ పాత్రల్లో మెప్పించాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించారు మేకర్స్. త్వరలోనే సర్దార్ 2 సెట్స్ మీదకు వెళ్లనుంది. చదవండి: ఆత్మహత్య తప్ప మరో దిక్కు లేదు: పావలా శ్యామల అవకాశాలు రావడం లేదనడం కరెక్ట్ కాదు: అనూ ఇమ్మాన్యుయేల్ -
అప్పుడే సర్దార్ సీక్వెల్ ప్రకటించిన మేకర్స్, స్పెషల్ వీడియో రిలీజ్
కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సర్దార్’. రాశీ ఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో చంద్రబోస్ అలియాస్ ‘సర్దార్’, ఆయన తనయుడు ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాశ్ పాత్రల్లో మెప్పించారు కార్తీ. ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. పోలీసాఫీసర్‌గా రాజీనామా చేసి, ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్‌గా చేరాలన్న ఆఫర్‌కు విజయ్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం, విజయ్ కొత్త మిషన్ కంబోడియాలో ఆరంభం కానున్నట్లుగా టీజర్లో చూపించడం జరిగింది. హీరో కార్తీ, దర్శకుడు పీఎస్ మిత్రన్, నిర్మాత లక్ష్మణ్ కాంబినేషన్లోనే ఈ సీక్వెల్ తెరకెక్కనుంది. #Sardar 💥 Once a spy, always a spy! Mission starts soon!!#Sardar2 💥💥@Karthi_Offl @Prince_Pictures @RedGiantMovies_ @Psmithran @gvprakash @lakku76 @RaashiiKhanna @rajishavijayan @ChunkyThePanday @george_dop @AntonyLRuben @dhilipaction @kirubakaran_AKR @DuraiKv pic.twitter.com/rVu5IxGRZp — Prince Pictures (@Prince_Pictures) October 25, 2022 -
సర్ధార్ సక్సెస్ మీట్: నాగార్జున అన్న సపోర్ట్‌ని మర్చిపోలేను: హీరో కార్తీ
‘‘ఖాకీ, ఖైదీ’ చిత్రాల్లానే కొత్తగా చేస్తే తప్పకుండా ఆదరిస్తామని ‘సర్దార్’తో మరోసారి నిరూపించారు ప్రేక్షకులు. మా కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని హీరో కార్తీ అన్నారు. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన చిత్రం ‘సర్దార్’. రాశీఖన్నా, రజీషా విజయన్ కథానాయికలు. లైలా కీలక పాత్రలో నటించారు. ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలైంది. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్ర సక్సెస్ మీట్లో హీరో కార్తీ మాట్లాడుతూ.. ‘‘నాగార్జున అన్న సపోర్ట్‌ని మర్చిపోలేను. సినిమా అనేది ఒక సంస్కృతిగా ఉన్న మన దేశంలో ఒక నటుడిగా ఉండటం నా అదృష్టం’’ అన్నారు. ‘‘తెలుగులో ‘సర్దార్’ విడుదల చేసినందుకు గర్వంగా ఉంది. మంచి సినిమాని ఆదరించే తెలుగు ప్రేక్షకులు నిజంగా దేవుళ్లు’’ అన్నారు నిర్మాత సుప్రియ. ‘‘నా తొలి చిత్రం ‘అభిమన్యుడు’ సినిమాని తెలుగు ప్రేక్షకులు హిట్ చేశారు. ఇప్పుడు ‘సర్దార్’కి మరో ఘన విజయం ఇచ్చినందుకు థ్యాంక్స్’’ అన్నారు పీఎస్ మిత్రన్. రజీషా విజయన్, నటుడు–రచయిత రాకేందుమౌళి మాట్లాడారు. -
'సర్దార్' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
Sardar Review: ‘సర్దార్’ మూవీ రివ్యూ
టైటిల్: సర్దార్ నటీనటులు: కార్తీ, రాశీఖన్నా, చుంకీ పాండే, రజిషా విజయన్, లైలా, మునిష్కాంత్, అశ్విన్, బాలాజీ శక్తివేల్ తదితరులు నిర్మాణ సంస్థలు: ప్రిన్స్ పిక్చర్స్, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాతలు: ఎస్ లక్ష్మణ్ కుమార్ దర్శకత్వం: పీఎస్ మిత్రన్ సంగీతం: జీవీ ప్రకాశ్ సినిమాటోగ్రఫీ: జార్జ్ సి.విలియమ్స్ ఎడిటర్: రూబెన్ విడుదల తేది: అక్టోబర్ 21, 2022 ‘సర్దార్’ కథేంటంటే.. విజయ్ ప్రకాష్ (కార్తీ) ఒక పోలీసు ఇన్స్పెక్టర్. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండటమంటే అతనికి పిచ్చి. పని మీద కంటే మీడియా మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఓ రోజు ఆంధ్రా యూనివర్సీటీ నుంచి చాలా ముఖ్యమైన ఫైల్ మిస్ అవుతుంది. అందులో భారత సైనిక రహస్యాలు ఉన్నాయని తెలుస్తుంది. ఆ ఫైల్ ఎక్కడ ఉందో కనిపెట్టడానికి సీబీఐ, ‘రా’ అధికారులు రంగంలోకి దిగుతారు. ఈ విషయం విజయ్ ప్రకాశ్‌కి తెలుస్తుంది. అతనికి ఫేమ్ రావాలి అనే ఫోబియా కారణంగా సీబీఐ, రా అధికారుల కంటే ముందే ఆ ఫైల్ని కనిపెట్టాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో విజయ్‌కి తన తండ్రి సర్దార్ (కార్తి) గురించి, ఆయన చేపట్టిన మిషన్ గురించి తెలుస్తుంది. అసలు సర్దార్ ఎవరు? ఆయన చేపట్టిన మిషన్ ఏంటి? సర్దార్‌పై దేశద్రోహి అనే ముద్ర ఎలా పడింది? చివరకు తండ్రి చేపట్టిన మిషన్‌లో విజయ్ ప్రకాశ్ ఎలా భాగమయ్యాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న మోసాలను ప్రజలకు అర్థమయ్యేలా చూపించడంలో దర్శకుడు పీఎస్ మిత్రన్ దిట్ట. తొలి చిత్రం ‘అభిమన్యుడు’లో బ్యాంక్ మోసాలు, డిజిటల్ మోసాల్లో దాగి ఉన్న నిజాన్ని బయటకు తెచ్చాడు. కమర్షియల్ అంశాలను జోడీస్తూనే ‘హీరో’లో కూడా ప్రజలకు ఉపయోగపడే సందేశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ‘సర్దార్’లో కూడా ఓ భారీ మోసాన్ని జనాలకు చూపించాడు. నీటి నిర్వాహణను ప్రైవేటీకరణం చేయడం వల్ల జరిగే నష్టాలు ఏంటి? సమస్త జీవకోటికి ప్రాణధారమైన నీటిని కొంతమంది స్వార్థపరులు తమ గుప్పెట్లో పెట్టుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే అంశాన్ని ఓ గూఢచారి కథతో ముడిపెట్టి చూపించాడు. పైప్‌లైన్ పేరుతో భారతదేశ నీటిని తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్న ఓ బడా వ్యాపారవేత్త ప్రయత్నాన్ని.. దేశద్రోహి ముద్రవేసుకొని, అజ్ఞాతంలో ఉన్న ఓ వ్యక్తి ఎలా అడ్డుకున్నాడు అనేదే సర్దార్ కథ. సర్దార్ పాత్రని పరిచయం చేస్తు కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత విజయ్ కుమార్‌ని రంగంలోకి దించాడు దర్శకుడు. ఫస్టాఫ్ అంతా విజయ్ కుమార్ చుట్టూ తిరుగుతుంది. మీడియాలో పడేందుకు అతను చూపించే ఆసక్తి, హీరోయిన్‌తో ప్రేమాయణం ఇలా సాదాసీదాగా సాగుతుంది. సామాజిక కార్యకర్త సమీరా (లైలా) మరణంతో కథ మలుపు తిరుగుతుంది. ఇక అసలు కథ సెకండాఫ్‌లో మొదలవుతుంది. సర్దార్ ప్లాష్‌బ్యాక్, అతను చేపట్టిన మిషన్ సంబంధించిన సన్నివేశాలతో సెకండాఫ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఇలాంటి కథలు మనకు కొత్తేమి కాదు. ఒక గూఢచారి దేశం కోసం తన జీవితాన్ని ఎలా త్యాగం చేస్తాడు? అనేది గతంలో చాలా సినిమాల్లో చూపించారు. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు కూడా గత సినిమాల మాదిరే ఉంటుంది. కానీ కార్తి పాత్రలని తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఎవరెలా చేశారంటే... ఈ సినిమాలో కార్తి తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. పోలీసు అధికారి విజయ్ కుమార్‌గా, 60 ఏళ్ల వయసుపైబడిన గూఢచారి సర్దార్‌గా రెండూ పాత్రలను అద్భుతంగా పోషించాడు. అతని బహుళ గెటప్‌లను మెచ్చుకోవాలి. లాయర్ షాలినిగా రాశీఖన్నా ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు నిడివి తక్కువనే చెప్పాలి. సామాజిక కార్యకర్త సమీరాగా లైలా తనదైన నటనతో ఆకట్టుకుంది. విలన్‌గా చుంకీ పాండే మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. జీవీ ప్రకాశ్ సంగీతం బాగుంది. తమిళ ఫ్లేవర్ కారణంగా తెలుగు పాటలు రిజిస్టర్ కాలేదు కానీ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ, రూబెన్ ఎడిటింగ్ బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
కార్తీ ‘సర్ధార్’ మూవీ ట్విటర్ రివ్యూ
తమిళ హీరో కార్తీకి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిట్, ప్లాప్స్తో సంబంధంగా లేకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా దూసుకుపోతోన్నాడు. తమిళ్ లోనే కాదు తెలుగులోనూ కార్తీకి మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలు సాధించిన విషయం తెలిసిందే. ఇటీవలే పొన్నియన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీ ఇప్పుడు సర్ధార్‌గా థియేటర్లో అలరించేందుకు రెడీ అయ్యాడు. కార్తీ ప్రధాన పాత్రలో అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ తెరకెక్కించిన సినిమా సర్దార్. చదవండి: Ginna Twitter Review: ‘జిన్నా’మూవీ ట్విటర్ రివ్యూ ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో రాశి ఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ దీపావళి కానుకగా ఈ శుక్రవారం(అక్టోబర్ 21) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే యుఎస్‌తో పాటు తమిళనాడులో పలు థియేటర్స్‌లో ప్రీమియర్ షోలు పడటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఎన్నో అంచనాల మధ్య నేడు థియేటర్లోకి వచ్చిన సర్ధార్ గురించి ట్విటర్లో ఏమంటున్నారో ఓసారి చూద్ధాం. Saw #Sardar !!! Perfect Diwali 🪔 Mass Entertainer! #Karthi Rocked all the way. ⭐️⭐️⭐️ — Umair Sandhu (@UmairSandu) October 20, 2022 #Sardar - Blockbuster 🔥🔥🔥 3rd in a row for #Karthi !!! 2022 will be the most memorable year for him !! 🔥🔥👌👌👌 https://t.co/xP6lrrKr15 — Zaro (@toto_motto) October 21, 2022 #Sardar very interesting first half Anukole intha baguntadi ani. pic.twitter.com/cY7tFxHYbt — Incognito Telugu (@IncognitoTelugu) October 21, 2022 #Sardar - Winner 👍 — CINEMA GALATTAA (@CinemaGalattaa) October 20, 2022 #sardar entrance mass as expected 😎😎😎 #SardarDeepavali #SardarFromOct21 — தூம் தாதா ⚡⚡ (@misturMBA) October 21, 2022 Karthi anna - the diwali winner of all time 😤🔥 Kaithi vs Bigil #Sardar vs prince #SardarDeepavali #SardarDiwali pic.twitter.com/1bTVyNxIZg — 👹Aravø Sambø👺 (@aravo_sambo) October 21, 2022 -
'సర్దార్' నాకో సవాల్.. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది: కార్తి
హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్'. రాశి ఖన్నా, రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతుంది. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది. ఈ నేపధ్యంలో హీరో కార్తి విలేఖరుల సమావేశంలో 'సర్దార్' విశేషాలని పంచుకున్నారు. పొన్నియిన్ సెల్వన్ తో బ్లాక్ బస్టర్ కొట్టారు.. కొంచెం గ్యాప్ లోనే సర్దార్ తో వస్తున్నారు.. ఎలా అనిపిస్తుంది ? పొన్నియిన్ సెల్వన్ సమ్మర్ కి రావాలి. కొంచెం ఆలస్యంగా వచ్చినా గొప్ప విజయాన్ని అందుకుంది. పొన్నియిన్ సెల్వన్ తర్వాత ఒక సిసినిమా తీసుకురావాలంటే ఖచ్చితంగా కొత్తగా స్పెషల్ గా ఉండాలి. అలా ఇండియన్ స్పై థ్రిల్లర్ గా సర్దార్ వస్తోంది. ఇందులో మొదటిసారి తండ్రి కొడుకుల పాత్రలో కనిపిస్తున్నా. కథ ప్రకారం చాలా గెటప్స్ ఉంటాయి. ఇప్పటివరకూ నేర్చుకున్నది ఒక పరీక్షలా ఉంది.(నవ్వుతూ). ఒక గ్రామంలో పెరిగిన రంగస్థల నటుడు గూఢచారిగా మారి ఏం చేశాడనేది దర్శకుడు మిత్రన్ అద్భుతంగా చూపించారు. 1980లో జరిగే కథ, ఆ ప్రపంచాన్ని చాలా వండర్ఫుల్ గా తీశారు. ఈ సినిమా కోసం చాలా పరిశోధన చేశారు. ట్రైలర్ లో ఒక ఫైల్ మిస్సింగ్ గురించి చూపించాం కదా.. అందులో మనం బ్రతకడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. సర్దార్ కథ వినకముందు దాని గురించి ఆలోచన లేదు. ఈ సినిమా చూసిన తర్వాత కొన్ని మామూలు అలవాట్లు మార్చుకుంటారనే నమ్మకం ఉంది. సర్దార్ లో తండ్రి పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు ? 60 ఏళ్లలో శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయని మా నాన్న గారిని అడిగాను. అయితే ఆయనకి యోగా అలవాటు ఉంది. దాని వలన ఆయన శరీరంలో ఎలాంటి మార్పులు లేవు. నాజర్ గారిని అడిగాను. మెట్లు ఎక్కడం కొంచెం ఇబ్బంది, అలాగే మాట్లాడినప్పుడు నోటి నుంచి ఎక్కువ గాలి వస్తుందని కొన్ని విషయాలు చెప్పారు. గెటప్ వేసుకుంటే ఓల్డ్ మ్యాన్ లా కనిపించవచ్చు. కానీ సర్దార్ యాక్షన్ కూడా చేయాలి. సర్దార్ కి పోలీస్ పాత్రలకు మధ్య స్పష్టమైన తేడా చూపించాలి. ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశా. ఖైదీ సినిమా చేసినప్పుడు ఒక హాలీవుడ్ సినిమాకి ధీటుగా ఉండాలని తీశాం. సర్దార్ ని కూడా అలా ఒక హాలీవుడ్ మూవీలా ప్రజంట్ చేశాం. నా కెరీర్ లో ఇది సవాల్ తో కూడిన పాత్ర. కెమరామెన్ జార్జ్ కొత్త ప్రపంచం చూపించారు. 1980 వరల్డ్ ని సృస్టించారు. జీవీ ప్రకాష్ కుమార్ అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రంలో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. సర్దార్ పాత్ర సమాజం నుంచి ఏమీ ఆశించదు. దేశం కోసమే పని చేస్తుంది. పోలీస్ పాత్రకి ప్రతి చిన్నదానికి పబ్లిసిటీ కావాలి. ఈ రెండు పాత్రల మధ్య చాలా వైవిధ్యం ఉంటుంది. సర్దార్ కథ యదార్ధ సంఘటనల స్ఫూర్తి ఆధారంగా ఉంటుందా ? సర్దార్ పాత్ర రియల్ క్యారెక్టర్ స్ఫూర్తితో డిజైన్ చేశారు. ఇక్కడ పుట్టిన ఒక రంగస్థల నటుడు పాకిస్తాన్ లో జనరల్ గా పని చేశారు. దీని స్ఫూర్తిగా సర్దార్ కథని రాశారు. సర్దార్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా నచ్చుతాడా ? సర్దార్ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. దిపావళికి కుటుంబం అంతా కలసి సర్దార్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో లైలా పాత్రకి ఒక కొడుకు ఉంటాడు. ఆ పాత్రలో చాలా హ్యుమర్ ఉంటుంది. స్పై వరల్డ్ ని నమ్మేలా చేసిన పాత్రది. సర్దార్ లాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి. అందరూ చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సర్దార్ లాంటి సినిమాకి పాన్ ఇండియా అవకాశం ఉంది కదా ? అవును. యునీవర్సల్ అప్పీల్ ఉన్న సినిమా సర్దార్. ఈ సినిమాలో విలన్ గా చేసిన చుంకీ పాండే గారు మొదటి రోజు నుంచి ఇది పాన్ ఇండియా సినిమా అనే చెబుతున్నారు. ఇప్పుడు హిందీలో కొన్ని సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఒక వారం తర్వాత బాలీవుడ్ లో విడుదల చేయాలనే ఆలోచన ఉంది. వైవిధ్యమైన, భారీ సినిమాలు చేస్తున్నప్పుడు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే సందేహం ఉంటుందా ? నిజానికి ప్రేక్షకులు ఇచ్చిన నమ్మకంతోనే ఇలాంటి భారీ సినిమాలు చేస్తున్నాను. కాష్మోరా, ఖాకీ, ఖైధీ, పోన్నియిన్ సెల్వన్ ఇలా అన్నీ చిత్రాలని ఆదరిస్తున్నారు. వారు ఇచ్చిన ప్రోత్సాహంతో వైవిధ్యమైన సినిమాలు చేయాలనే ఉత్సాహం వస్తోంది. తెలుగులో నేరుగా సినిమా ఎప్పుడు చేస్తున్నారు ? కొన్ని కథలు వింటున్నాను. నిజానికి తెలుగు నాకు వేరే పరిశ్రమ అనుకోను. ఇది నా సొంత ఇల్లు. అమ్మ ఇంటి నుంచి పిన్ని ఇంటికి వచ్చినట్లే ఉంటుంది. (నవ్వుతూ) ఊపిరిలో నాగార్జున గారితో కలసి నటించారు.. సర్దార్ నాగార్జున గారు విడుదల చేస్తున్నారు .. ఎలా అనిపిస్తుంది ? నాగార్జున అన్నయ్య ఉంటే చాలా హాయిగా ఉంటుంది. సినిమాకి కావాల్సినవన్నీ ఆయనే చూసుకుంటారు. నన్ను చాలా ప్రేమిస్తారు. ట్రైలర్ చూసి చాలా ప్రామిసింగ్ గా ఉన్నావ్ అని మెసేజ్ పెట్టారు. ఆయన పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. కథలు పాన్ ఇండియాని దృష్టి లో పెట్టుకొని ఎన్నుకుంటున్నారు..ఈ ఒత్తిడి మీపై ఉంటుందా ? నిజానికి పాన్ ఇండియా ప్లాన్ చేస్తే వచ్చేది కాదు. మన ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో ముందు దాన్ని చూసుకోవాలి. రాజమౌళి గారు బాహుబలిని తెలుగు ప్రేక్షకుల కోసం తీశారు. అది పాన్ వరల్డ్ వెళ్ళింది. సినిమా, కాన్సెప్ట్ బాగుంటే ఆటోమేటిక్ గా పాన్ ఇండియా ఆడుతుంది. దర్శకుడు పిఎస్ మిత్రన్ లో మీకు నచ్చిన అంశాలు ? మిత్రన్ది మంచి వ్యక్తిత్వం. దర్శకుడిగా ఒక బలమైన విషయాన్ని సమాజానికి చెప్పాలి చూపించాలనే ఆయన తపన నాకు నచ్చింది. ఆయన ఎవరు ఐడియా ఇచ్చిన తీసుకుంటారు. ఎలాంటి ఈగో ఉండదు. సినిమా మంచి కోసమే తపించే దర్శకుడు. ఆయన రీసెర్చ్ చాలా బాగుంటుంది. సర్దార్ పట్ల సూర్య గారు ఎలా స్పందించారు ? అన్నయ్య ట్రైలర్ చూసి చాలా సర్ ప్రైజ్ అయ్యారు. చాలా పెద్ద సినిమా, బలమైన కంటెంట్ ఉన్న సినిమాలా అనిపిస్తుందని చెప్పారు. దీపావళి కి నాలుగు సినిమాలు వస్తున్నాయి ? ఎలాంటి పోటి ఉంటుందని భావిస్తున్నారు? గతంలో పది సినిమాలు కూడా వచ్చాయి’నవ్వుతూ). పోటి అంటూ ఏమీ ఉండదు. సినిమా బాగుంటే ఖచ్చితంగా చూస్తారని నమ్ముతాను. ఖైధీ 2 ఎప్పుడు ? ఢిల్లీ వెళ్ళినా ఢిల్లీ గురించి అడుగుతున్నారు( నవ్వుతూ). విక్రమ్ తర్వాత దీనికి పై మరిన్ని అంచనాలు పెరిగాయి. త్వరలోనే చేస్తాం. -
దీపావళికి థియేటర్స్‌లో సందడి చేయబోయే సినిమాలివే..
పండగ సీజన్ అనగానే సినీ ప్రేక్షకులు కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాల కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. ఇప్పటికే దసరా కానుకగా మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, కింగ్ నాగార్జున ‘ది ఘోస్ట్’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీపావళి సందర్భంగా యంగ్ హీరోలు బాక్సాఫీస్ వద్దబరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం. మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య డైరెక్షన్ లో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ ‘జిన్నా’. పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 21న థియేటర్స్‌లో సందడి చేసేందుకు సిద్ధమయ్యింది. ఇప్పటికే ట్రైలర్, పాటలతో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. దీనికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో మూవీపై బజ్ ఏర్పడింది. మరి జిన్నాపైనే ఆశలు పెట్టుకున్న విష్ణు ఈ సినిమాతో హిట్ కొటతాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇక యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జోడీగా అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ లో రూపొందిన సోషియో ఫాంటసీ మూవీ ‘ఓరి దేవుడా’. విక్టరీ వెంకటేశ్ మోడ్రన్ దేవుడిగా ఎంటర్ టైన్ చేయబోతున్న ఈ మూవీ తమిళ సూపర్ హిట్ ‘ఓ మై కడవుళే’ కు రీమేక్‌గా తెరకెక్కింది. తమిళంలో అశోక్ సెల్వన్, రితికాసింగ్, వాణిబోజన్, విజయ్ సేతుపతి నటించిన ఈ సినిమా అక్కడ హిట్ అయింది. డిఫరెంట్ జానర్‌తో వస్తున్న విశ్వక్ ఓరి దేవుడా అంటూ ఈనెల21న ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందన్నది చూడాలి. దీపావళి కానుకగా రాబోతున్న మరో సినిమా ప్రిన్స్. శివ కార్తికేయన్,మారియా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ రెండు భాషలలోనూ ఈ సినిమా ఈనెల 21న విడుదల కాబోతుంది.ఇందులో శివకార్తికేయన్ స్కూల్ టీచర్‌గా నటించారు. నటుడు ఇందులో సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై మాంచి బజ్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు ప్రిన్స్ కోసం హీరో విజయ్ దేవరకొండ సైతం రంగంలోకి దిగి ప్రమోషన్స్ చేశారు. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందన్నది చూడాల్సి ఉంది. ఇక మరో తమిళ హీరో కార్తి కూడా ఈసారి దీపావళి బరిలోకి దిగుతున్నారు. కార్తీ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం సర్దార్. పీఎస్ మిత్రాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. రాశిఖన్నా,రజీషా విజయన్ ఇందులో హీరోయిన్స్‌గా నటించారు. నటి లైలా ఇందులో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో దాదాపు 15 గెటప్పుల్లో కార్తి కనిపించనున్నట్లు తెలుస్తోంది. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా ఈనెల 21న తెరపైకి రానుంది. ఇప్పటికే కార్తికి తెలుగులోనూ మంచి డిమాండ్ ఉంది. మరి ఈ సినిమాతో కార్తికి ఇంకో హిట్టు పడినట్లేనా అన్నది చూద్దాం. -
హీరో శ్రీకాంత్‌ని ఇప్పటికీ ‘కొలబద్ద’అనే పిలుస్తా : లైలా
సీనియర్ హీరోయిన్ లైలా గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆప్పట్లో లైలాకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆమె కోసమే థియేటర్స్‌కి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. లైలాను తెలుగు తెరపై పరిచయం చేసింది ఎస్వీ కృష్ణారెడ్డి. 1997లొ ‘ఎగిరే పావురమా’ చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ గోవా బ్యూటీ. ఈ సినిమాలో శ్రీకాంత్ హీరోగా నటించాడు. సినిమా మొత్తం హీరోని ‘కొలబద్ద’అంటూ ఆటపట్టిస్తుంది హీరోయిన్. పిల్లలతో పద్యం కూడా పాడిస్తుంది. ఈ సీన్ ఇప్పటికీ నవ్వులు పూయిస్తుంది. అయితే సినిమాలో మాదిరే బయట కూడా శ్రీకాంత్‌ని అలానే ఆటపట్టిస్తుందట లైలా. ఇప్పటికీ శ్రీకాంత్‌ని ‘కొలబద్ద’అనే పిలుస్తుందట. 16 ఏళ్ల తర్వాత ‘సర్దార్’ ద్వారా మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది లైలా. కార్తి హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె ఓ కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా చిత్రబృందం తాజాగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న లైలాను స్టేజ్ మీదకు పిలుస్లూ..‘కొలబద్ద’ అని అన్నారు యాంకర్. దీంతో లైలా పగలబడి నవ్వింది. ఆ డైలాగ్‌ని గుర్తు చేస్తూ.. ఇప్పటికీ శ్రీకాంత్‌ని ఆ పేరుతోనే పిలుస్తానని చెప్పుకొచ్చింది. ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ సర్దార్ నాకు చాలా స్పెషల్ ఫిల్మ్, నేను నటించిన శివపుత్రుడు దీపావళి కి విదుదలై ఘన విజయం సాధించింది. సర్దార్ కూడా అదే రోజు వస్తోంది. దీపావళి నా పుట్టిన రోజు కూడా. కార్తి గారు అద్భుతంగా నటించారు. మిత్రన్ గారు చాలా మంచి సినిమాని తీశారు. అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి’అని కోరారు. -
కార్తీ నిరూపించుకున్నాడు: నాగార్జున
‘‘ఓ సూపర్‌స్టార్ అన్నగా(సూర్య) ఉన్నప్పుడు.. ఆ షాడో నుంచి బయటకు వచ్చి... సొంత ప్రతిభను నిరూపించుకోవడం అనేది చాలా తక్కువ. అటువంటి వారిని అరుదుగా నేను ఇద్దర్నే చూశాను. తెలుగులో చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్, కన్నడలో శివరాజ్‌కుమార్ సోదరుడు పునీత్ రాజ్‌కుమార్. ఇప్పుడు తమిళ్లో సూర్య బ్రదర్ కార్తీ. ఇలా నిరూపించుకోవడం కష్టమైన పని. విభిన్నమైన, ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ అన్నలా సూపర్‌స్టార్ అయ్యాడు కార్తీ’’ అని నాగార్జున అన్నారు. కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మించిన తమిళ చిత్రం ‘సర్దార్’. రాశీఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రంలో లైలా ఓ కీ రోల్ చేశారు. ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘సర్దార్’ ప్రీ రిలీజ్‌కి ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఊపిరి’ సినిమా నుంచి కార్తీతో నా అనుబంధం ప్రారంభమైంది. తను తెలుగులో మాట్లాడతాడు.. పాటలు పాడతాడు. తెలుగులో మాట్లాడినవారిని మనం హృదయాల్లో పెట్టుకుంటాం.. అందుకే కార్తీని తెలుగు ప్రేక్షకులు అంతగా ఆదరిస్తారు. అన్నపూర్ణ స్టూడియోస్ ‘సర్దార్’ సినిమాను సమర్పిస్తున్నందుకు చాలా గర్వంగా, హ్యాపీగా ఉంది’’అన్నారు. కార్తీ మాట్లాడుతూ– ‘‘నాగార్జునగారు నాకు రియల్ బ్రదర్.. పెద్ద స్ఫూర్తి. సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి ఆయన్ని ఎఫెక్ట్ చేయలేవు. సినిమాలంటే ఆయనకు ఎంతో ప్యాషన్. మంచి మనవతావాదిగా ఉంటేనే మంచి యాక్టర్‌గా ఉండగలమని నాగార్జునగారు ఓ సందర్భంలో చెప్పారు. నేనూ ఎప్పట్నుంచో ఫాలో అవుతున్నాను. నాగార్జునగారు యాక్ట్ చేస్తున్నారనే నేను ‘ఊపిరి’ సినిమా చేశాను. నా కెరీర్లో ‘సర్దార్’ చాలా ముఖ్యమైన సినిమా. ‘సర్దార్’ ఇండియన్ స్పై థ్రిల్లర్’’ అన్నారు. ‘‘నేను నటించిన ‘శివపుత్రుడు’ దీపావళికి రిలీజై హిట్ సాధించింది. ‘సర్దార్’ కూడా దీపావళికి విడుదలవుతోంది. నా బర్త్ డే కూడా ఈ దీపావళి రోజునే (అక్టోబరు 24). చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ప్రతి ఒక్కరూ ‘సర్దార్’ సినిమాను ఎంజాయ్ చేస్తారు’’అన్నారు. గేయ రచయిత రాకేందు మౌళి. అన్నపూర్ణ స్టూడియోస్ సాయిబాబా, కాస్ట్యూమ్ డిజైనర్ ప్రవీణ్ రాజా పాల్గొన్నారు. -
హీరో కార్తి 'సర్దార్' మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
దీపావళికి వస్తున్న సర్దార్.. ఆ విషయంలో సూర్యను దాటేస్తాడా?
హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్'. రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో దాదాపు 15 గెటప్పుల్లో కార్తి కనిపించనున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఇప్పటివరకు సూర్యను అధిగమించనున్నాడు. ఇంతకుముందు వీడొక్కడే సినిమాలో ఓ పాటకోసం పది రూపాల్లో కనిపించాడు సూర్య. (చదవండి: రంగస్థల నటుడిని గూఢచారిగా మార్చారు.. అదే ‘సర్దార్’కు స్ఫూర్తి) అయితే ఈ గెటప్స్ పాట కోసమా, సినిమాలో భాగంగా వేశాడా అన్న విషయం రిలీజైన తర్వాతే క్లారిటీ రానుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తి ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. అతనికి జంటగా రాశిఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించగా.. లైలా, చంకీ పాండే కీలకపాత్రలు పోషించారు. తమిళం, తెలుగులో ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది. టాలీవుడ్లో ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్డూడియోస్ సంస్థ విడుదల చేస్తుంది. ఈ చిత్రానికి దర్శకత్వం పీఎస్ మిత్రన్ వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్,ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 21న విడుదల కానుంది. -
రంగస్థల నటుడిని గూఢచారిగా మార్చారు.. అదే ‘సర్దార్’కు స్ఫూర్తి
హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్'. రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతుంది. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర దర్శకుడు పిఎస్ మిత్రన్ విలేఖరుల సమావేశంలో 'సర్దార్' విశేషాలని పంచుకున్నారు. ► నా తొలి చిత్రం 'అభిమన్యుడు' డబ్బింగ్ చేస్తున్నపుడే సర్దార్ ఐడియా వచ్చింది. నా రచయితల్లో ఒకరితో ఆలోచన పంచుకొని దాన్ని డెవలప్ చేశాం. నిర్మాత లక్ష్మణ్ గారికి ఈ కథ చెప్పాను. ఆయన కార్తి గారిని కలవమన్నారు. కార్తి గారికి 'సర్దార్' ఐడియా చాలా నచ్చింది. మరో ఆలోచన లేకుండా ఈ సినిమా తప్పకుండా చేస్తున్నామని చెప్పారు. ► వర్తమాన కాలంలో పాటు 1980లో నడిచే కథ ఇది. 1980 లో ఇండియన్ ఇంటలిజెన్స్ ఒక స్పై (గూఢచారి) ని తయారుచేయాలని ప్రయత్నించింది. అయితే సైన్యంలో పని చేసే వ్యక్తిని గూఢచారిగా మార్చడం అంత సులువు కాదు. గూఢచారికి నటించడం రావాలి, మారువేషాలు వేయడం తెలియాలి. దీనికి బదులు ఒక రంగస్థల నటుడిని గూఢచారిగా మార్చారు. ఇది యదార్ధంగా జరిగింది. ఈ సంఘటన సర్దార్ కథకు ఒక స్ఫూర్తి. అలాగని ఇది పూర్తిగా యాదార్ధకథ కాదు. కొన్ని యదార్ధ సంఘటనలు స్ఫూర్తితో చేసిన కథ. ► ఇందులో కార్తి పాత్ర చాలా సర్ ప్రైజింగా ఉంటుంది. కార్తి ఇందులో రెండు భిన్నమైన పాత్రలలో తండ్రి కొడుకులుగా కనిపిస్తారు. ఒకరి పాత్రకు మరొకరి పాత్రకి పూర్తి వైవిధ్యం ఉంటుంది. గూఢచారి పాత్ర ఎలాంటి గుర్తింపుని కోరుకోదు, తన ఉనికి గురించే బయట ప్రపంచానికి తెలీదు. మరో పాత్ర ప్రతి చిన్నదానికి పబ్లిసిటీని కోరుకుంటుంది. ఈ పాత్రలు రెండూ తెరపై చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ► నేను ఇప్పటివరకూ పని చేసిన నటుల్లో కార్తి ది బెస్ట్. తన పాత్ర పట్ల చాలా అంకిత భావంతో పని చేస్తారు. సినిమాకి ఉపయోగపడే చాలా ఆలోచలని పంచుకుంటారు. రాశి ఖన్నా , రజిషా విజయన్ పాత్రలు కథలో చాలా కీలకంగా ఉంటాయి. వారి పాత్రలని అద్భుతంగా చేశారు. అలాగే ఈ చిత్రంలో లైలా పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ► అఖిల్ తో ఒక సినిమా చేసే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. అయితే ప్రస్తుతానికి నా దృష్టి మాత్రం సర్దార్ విడుదల పైనే ఉంది. -
ఆ సంఘటనే సర్దార్కు స్ఫూర్తి
హీరో కార్తీ, దర్శకుడు పీఎస్ మిత్రన్ కాంబినేషన్లో రూపొందిన తమిళ చిత్రం ‘సర్దార్’. ఇందులో రాశీఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. కాగా అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ‘సర్దార్’ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తోంది. ‘సర్దార్’ రిలీజ్ సందర్భంగా దర్శకుడు పీఎస్ మిత్రన్ మాట్లాడుతూ– ‘‘నా దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ‘ఇరుంబుదురై’ (2018) (తెలుగులో ‘అభిమన్యుడు’) డబ్బింగ్ వర్క్స్ సమయంలో నాకు ‘సర్దార్’ ఐడియా వచ్చింది. కథ సిద్ధమైన తర్వాత నిర్మాత లక్ష్మణ్‌గారికి చెప్పినప్పుడు ఆయన హీరో కార్తీగారిని కలవమన్నారు. ఆయనకూ కథ నచ్చడంతో ‘సర్దార్’ మొదలైంది. వర్తమాన కాలంతో పాటు 1980లో నడిచే కథ ‘సర్దార్’. ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగం 1980లో ఓ స్పై (గూఢచారి)ని తయారు చేయాలని ప్రయత్నించింది. అయితే సైన్యంలో పని చేసే వ్యక్తిని గూఢచారిగా మార్చడం అంత సులువు కాదు. గూఢచారికి నటించడం రావాలి, మారు వేషాలు వేయగలిగి తప్పించు కోవడం తెలిసుండాలి. దీంతో ఓ రంగస్థల నటుడిని గూఢచారిగా మార్చారు. ఇది వాస్తవంగా జరిగింది. ఈ సంఘటనే ‘సర్దార్’ కథకు స్ఫూర్తి. కానీ ‘సర్దార్’ కథ పూర్తిగా వాస్తవం కాదు.. కొన్ని సంఘటనలు కల్పితం. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేశారు. ఒకరు గూఢచారిగా ఏ గుర్తింపును కోరుకోని వారైతే, మరొకరు పబ్లిసిటీని ఇష్టపడేవారు. ఈ రెండు పాత్రలు ఆడియన్స్‌కు ఆసక్తికరంగా అనిపిస్తాయి. కార్తీ అద్భుతంగా నటించారు. నాగార్జునగారి అన్నపూర్ణ స్డూడియోస్ ‘సర్దార్’ను తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అఖిల్‌తో ఓ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను’’ అని అన్నారు. -
స్పై థ్రిల్లర్ కథా చిత్రంగా సర్ధార్.. రిలీజ్‌కు రెడీ
తమిళసినిమా: నటుడు కార్తీ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం సర్దార్. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. నటి రాశిఖన్నా, నటి రజీషా విజయన్ హీరోయిన్లుగానూ.. నటి లైలా ముఖ్యపాత్రలోనూ నటించారు. బాలీవుడ్ నటుడు సంఘీపాండే కీలకపాత్ర పోషించారు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా ఈనెల 21న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చెన్నైలో చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కార్తీ మాట్లాడుతూ దర్శకుడు మిత్రన్ ఈ చిత్రం కథ గురించి చెబుతూ 1980లో మిలిటరీలో ఓ గూఢాచారి తన టీమ్‌ను తయారు చేయాలని భావాస్తారన్నారు. అయితే మిలిటరీకి చెందిన వారిని గూఢాచారిగా తయారు చేయటం కష్టం అనిపించడంతో ఒక నటుడికి గూఢాచారిగా శిక్షణ ఇచ్చి పాకిస్తాన్‌కి పంపిస్తారన్నారు. అది ఆసక్తిగా ఉండడంతో పూర్తి కథను తయారు చేయమని ఆయనకు చెప్పానన్నారు. ఆయన స్క్రిప్ట్ పూర్తి చేసి కథలో రెండు ప్రధాన పాత్రలు ఉంటాయని చెప్పడంతో మళ్లీ ద్విపాత్రాభినయమా? అని సందేహించానన్నారు. దర్శకుడు కథకు అవసరమని చెప్పడంతో సర్దార్ చిత్రాన్ని చేయడానికి సిద్ధమయ్యారని చెప్పారు. కథ వినగానే పలు గూఢాచారి పాత్రలు కళ్లముందు కదలాడాయన్నారు. అందరూ నటుల జీవితాలను ఇలాంటి ఒక కథ పాత్ర కచ్చితంగా ఉంటుందన్నారు. ఎంజీఆర్, శివాజీ గణేషన్, రజనీకాంత్, కమలహాసన్ కాలంలోనూ ఇలాంటి పాత్రలు కనిపించాయన్నారు. తన అన్నయ్య సూర్య కూడా అయన్ చిత్రంలో రకరకాల గెటప్‌లలో కనిపించారని గుర్తుచేశారు. సర్దార్ చిత్రంలో తండ్రీ కొడుకులుగా నటించడానికి గట్టిగానే శ్రమించాల్సి వచ్చిందన్నారు. ముఖ్యంగా ఆ పాత్రల స్వభావానికి తగ్గట్గుగా వైవిధ్యాన్ని చూపిస్తూ నటించడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు చెప్పారు. ఫైట్స్ సన్నివేశాలు భారీ స్థాయిలో ఉంటాయన్నారు. ఇది ఇండియన్ స్పై థ్రిల్లర్ కథా చిత్రమని, అలాగని జేమ్స్‌బాండ్ చిత్రంలో మాదిరి ఇందులో బికినీలు, సిక్స్‌ప్యాక్‌లు ఉంటాయని మాత్రం అడగొద్దు అన్నారు. చిత్రంలో ప్రతి పాత్రకు నటీనటులు కరెక్ట్‌గా నప్పారని తెలిపారు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చిందని కార్తీ పేర్కొన్నారు. -
కార్తీ, రాశీఖన్నాల 'సర్దార్' రిలీజ్ డేట్ ఫిక్స్
దీపావళికి సర్దార్ కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘సర్దార్’. రాశీ ఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లు. దీపావళి సందర్భంగా ఈ నెల 21న ఈ చిత్రం థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనుంది. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ‘‘టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రంలో కార్తీ ఆరు గెటప్స్‌లో నటించారు. భారీ నిర్మాణ విలువలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ‘మీరు వెతుకుతున్న స్పై పేరు ఏంటి?’, ‘అతనికి ఎనిమిది దేశాల పాస్పోర్ట్స్ ఉన్నాయి’, ‘ఆరువందల సార్లు ఇంట్రాగేట్ చేశాం. ప్రతిసారీ ఒక్కో లాంగ్వేజ్.. ఒక్కో కథ.. ఇవన్నీ నిజమేనని మిషన్ చెబుతోంది’, ‘ఆ ఆరుమంది ఒక్కరే..’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. -
నాగార్జున-కార్తీ కాంబినేషన్లో 'సర్ధార్'..
Karthi Sardar Movie Telugu Distribution Rights To Nagarjuna: నాగార్జున–కార్తీ కాంబినేషన్లో ‘ఊపిరి’ తర్వాత మరో సినిమా రానుంది. ‘ఊపిరి’లో ఈ ఇద్దరూ నటించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం నటులుగా కాదు.. వీరి కాంబినేషన్ రిపీట్ కానున్నది నిర్మాత, హీరోగా. కార్తీ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘సర్దార్’ని తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై విడుదల చేయనున్నారు నాగార్జున. ఈ చిత్రం తెలుగు పంపిణీ హక్కులను సొంతం చేసుకున్న విషయాన్ని సోమవారం (జూన్ 27) ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ని తెలుగు, తమిళ భాషల్లో దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి 'అభిమన్యుడు' ఫేమ్ పీఎస్ మిత్రాన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సంగీతం జీవీ ప్రకాష్ కుమార్ అందిచగా, కెమెరా బాధ్యతలను జార్జ్ సి. విలియమ్స్ చేపట్టారు. చదవండి: హార్ట్ సింబల్స్‌తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్.. నా ప్రతి అడుగులో అతను ఉన్నాడు: యంగ్ హీరోయిన్ We are truly elated to be teaming up with @Prince_Pictures to distribute@Karthi_Offl 's Much awaited flick #Sardar in AP & TS 💥💥 WW Releasing this DIWALI 🧨🎇#SardarDiwali 💥@Psmithran @RaashiiKhanna_ @rajisha_vijayan @gvprakash @RedGiantMovies_ @lakku76 @ChunkyThePanday pic.twitter.com/jhQM4YI9Cb — Annapurna Studios (@AnnapurnaStdios) June 27, 2022 The Chaos will be 🔛 with his ARRIVAL ! @Karthi_Offl 's Most Awaited Film #Sardar AP & TS Distribution Rights Bagged by #AnnapurnaStudios 💥 WW Releasing this DIWALI 🧨🎇#SardarDiwali 💥@Psmithran @Prince_Pictures @RaashiiKhanna_ @rajisha_vijayan @gvprakash @RedGiantMovies_ pic.twitter.com/OwH14sbSDg — Annapurna Studios (@AnnapurnaStdios) June 27, 2022 -
అది కాస్త కష్టంగా అనిపించినా నాకు ఇష్టమే: రాశిఖన్నా
నిద్రపోవడానికి కూడా సమయం లేనంత బిజీగా ఉంటున్నారు రాశీ ఖన్నా. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ‘యోధ’ సినిమా షూటింగ్ షెడ్యూల్లో రాశీ పాల్గొంటున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. దర్శక ద్వయం సాగర్, పుష్కర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాశీతో పాటు దిశా పటానీ హీరోయిన్గా నటిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది నవంబరులో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వడానికి ముందు తమిళ చిత్రం ‘సర్దార్’ షూట్లో పాల్గొన్నారు రాశీ. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కార్తీ హీరో. ఈ సినిమా నైట్ షూట్‌ను ముగించుకుని ‘యోధ’ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు రాశీ ఖన్నా. ‘‘సర్దార్’ నైట్ షూట్స్‌ను కంప్లీట్ చేసిన వెంటనే ఢిల్లీలో జరుగుతోన్న ‘యోధ’ డే షూట్స్‌లో జాయిన్ అయ్యాను. సరిగ్గా నిద్రపోయేంత సమయం కూడా ఉండటం లేదు. ఆర్టిస్ట్ లైఫ్ కాస్త కష్టంగా అనిపించినా నాకు ఇష్టమే’’ అని పేర్కొన్నారు రాశీ ఖన్నా. ఇక తెలుగులో రాశీ ఖన్నా హీరోయిన్గా చేసిన గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’ చిత్రాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.