![Sardar Producer Lakshman Gifted Costly Car To Director PS Mithran - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/2/sardar.gif.webp?itok=_NAprRZE)
కార్తీ హీరోగా, రాశీ ఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం సర్దార్. వాటర్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 21న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సంతోషంలో నిర్మాత సర్దార్ డైరెక్టర్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. సర్దార్ నిర్మాత ప్రిన్స్ పిక్చర్స్ అధినేత ఎస్. లక్ష్మణ్ డైరెక్టర్ పీఎస్ మిత్రన్ కోసం ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. హీరో కార్తీ చేతుల మీదుగా దాన్ని పీఎస్ మిత్రన్‌కు అందించాడు. ఈ కారు ధర రూ.32 లక్షలపైనే ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇకపోతే సర్దార్ సినిమాలో కార్తీ.. చంద్రబోస్ అలియాస్ సర్దార్, ఆయన తనయుడు ఇన్‌స్పెక్టర్ విజయ్ ప్రకాశ్ పాత్రల్లో మెప్పించాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించారు మేకర్స్. త్వరలోనే సర్దార్ 2 సెట్స్ మీదకు వెళ్లనుంది.
చదవండి: ఆత్మహత్య తప్ప మరో దిక్కు లేదు: పావలా శ్యామల
అవకాశాలు రావడం లేదనడం కరెక్ట్ కాదు: అనూ ఇమ్మాన్యుయేల్
Comments
Please login to add a commentAdd a comment