PS Mithran
-
సర్దార్ హిట్.. దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్, ఫొటో వైరల్
కార్తీ హీరోగా, రాశీ ఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం సర్దార్. వాటర్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 21న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సంతోషంలో నిర్మాత సర్దార్ డైరెక్టర్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. సర్దార్ నిర్మాత ప్రిన్స్ పిక్చర్స్ అధినేత ఎస్. లక్ష్మణ్ డైరెక్టర్ పీఎస్ మిత్రన్ కోసం ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. హీరో కార్తీ చేతుల మీదుగా దాన్ని పీఎస్ మిత్రన్‌కు అందించాడు. ఈ కారు ధర రూ.32 లక్షలపైనే ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారాయి. ఇకపోతే సర్దార్ సినిమాలో కార్తీ.. చంద్రబోస్ అలియాస్ సర్దార్, ఆయన తనయుడు ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాశ్ పాత్రల్లో మెప్పించాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించారు మేకర్స్. త్వరలోనే సర్దార్ 2 సెట్స్ మీదకు వెళ్లనుంది. చదవండి: ఆత్మహత్య తప్ప మరో దిక్కు లేదు: పావలా శ్యామల అవకాశాలు రావడం లేదనడం కరెక్ట్ కాదు: అనూ ఇమ్మాన్యుయేల్ -
కార్తీ నిరూపించుకున్నాడు: నాగార్జున
‘‘ఓ సూపర్‌స్టార్ అన్నగా(సూర్య) ఉన్నప్పుడు.. ఆ షాడో నుంచి బయటకు వచ్చి... సొంత ప్రతిభను నిరూపించుకోవడం అనేది చాలా తక్కువ. అటువంటి వారిని అరుదుగా నేను ఇద్దర్నే చూశాను. తెలుగులో చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్, కన్నడలో శివరాజ్‌కుమార్ సోదరుడు పునీత్ రాజ్‌కుమార్. ఇప్పుడు తమిళ్లో సూర్య బ్రదర్ కార్తీ. ఇలా నిరూపించుకోవడం కష్టమైన పని. విభిన్నమైన, ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ అన్నలా సూపర్‌స్టార్ అయ్యాడు కార్తీ’’ అని నాగార్జున అన్నారు. కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మించిన తమిళ చిత్రం ‘సర్దార్’. రాశీఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రంలో లైలా ఓ కీ రోల్ చేశారు. ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘సర్దార్’ ప్రీ రిలీజ్‌కి ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఊపిరి’ సినిమా నుంచి కార్తీతో నా అనుబంధం ప్రారంభమైంది. తను తెలుగులో మాట్లాడతాడు.. పాటలు పాడతాడు. తెలుగులో మాట్లాడినవారిని మనం హృదయాల్లో పెట్టుకుంటాం.. అందుకే కార్తీని తెలుగు ప్రేక్షకులు అంతగా ఆదరిస్తారు. అన్నపూర్ణ స్టూడియోస్ ‘సర్దార్’ సినిమాను సమర్పిస్తున్నందుకు చాలా గర్వంగా, హ్యాపీగా ఉంది’’అన్నారు. కార్తీ మాట్లాడుతూ– ‘‘నాగార్జునగారు నాకు రియల్ బ్రదర్.. పెద్ద స్ఫూర్తి. సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి ఆయన్ని ఎఫెక్ట్ చేయలేవు. సినిమాలంటే ఆయనకు ఎంతో ప్యాషన్. మంచి మనవతావాదిగా ఉంటేనే మంచి యాక్టర్‌గా ఉండగలమని నాగార్జునగారు ఓ సందర్భంలో చెప్పారు. నేనూ ఎప్పట్నుంచో ఫాలో అవుతున్నాను. నాగార్జునగారు యాక్ట్ చేస్తున్నారనే నేను ‘ఊపిరి’ సినిమా చేశాను. నా కెరీర్లో ‘సర్దార్’ చాలా ముఖ్యమైన సినిమా. ‘సర్దార్’ ఇండియన్ స్పై థ్రిల్లర్’’ అన్నారు. ‘‘నేను నటించిన ‘శివపుత్రుడు’ దీపావళికి రిలీజై హిట్ సాధించింది. ‘సర్దార్’ కూడా దీపావళికి విడుదలవుతోంది. నా బర్త్ డే కూడా ఈ దీపావళి రోజునే (అక్టోబరు 24). చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ప్రతి ఒక్కరూ ‘సర్దార్’ సినిమాను ఎంజాయ్ చేస్తారు’’అన్నారు. గేయ రచయిత రాకేందు మౌళి. అన్నపూర్ణ స్టూడియోస్ సాయిబాబా, కాస్ట్యూమ్ డిజైనర్ ప్రవీణ్ రాజా పాల్గొన్నారు. -
రంగస్థల నటుడిని గూఢచారిగా మార్చారు.. అదే ‘సర్దార్’కు స్ఫూర్తి
హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్'. రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతుంది. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర దర్శకుడు పిఎస్ మిత్రన్ విలేఖరుల సమావేశంలో 'సర్దార్' విశేషాలని పంచుకున్నారు. ► నా తొలి చిత్రం 'అభిమన్యుడు' డబ్బింగ్ చేస్తున్నపుడే సర్దార్ ఐడియా వచ్చింది. నా రచయితల్లో ఒకరితో ఆలోచన పంచుకొని దాన్ని డెవలప్ చేశాం. నిర్మాత లక్ష్మణ్ గారికి ఈ కథ చెప్పాను. ఆయన కార్తి గారిని కలవమన్నారు. కార్తి గారికి 'సర్దార్' ఐడియా చాలా నచ్చింది. మరో ఆలోచన లేకుండా ఈ సినిమా తప్పకుండా చేస్తున్నామని చెప్పారు. ► వర్తమాన కాలంలో పాటు 1980లో నడిచే కథ ఇది. 1980 లో ఇండియన్ ఇంటలిజెన్స్ ఒక స్పై (గూఢచారి) ని తయారుచేయాలని ప్రయత్నించింది. అయితే సైన్యంలో పని చేసే వ్యక్తిని గూఢచారిగా మార్చడం అంత సులువు కాదు. గూఢచారికి నటించడం రావాలి, మారువేషాలు వేయడం తెలియాలి. దీనికి బదులు ఒక రంగస్థల నటుడిని గూఢచారిగా మార్చారు. ఇది యదార్ధంగా జరిగింది. ఈ సంఘటన సర్దార్ కథకు ఒక స్ఫూర్తి. అలాగని ఇది పూర్తిగా యాదార్ధకథ కాదు. కొన్ని యదార్ధ సంఘటనలు స్ఫూర్తితో చేసిన కథ. ► ఇందులో కార్తి పాత్ర చాలా సర్ ప్రైజింగా ఉంటుంది. కార్తి ఇందులో రెండు భిన్నమైన పాత్రలలో తండ్రి కొడుకులుగా కనిపిస్తారు. ఒకరి పాత్రకు మరొకరి పాత్రకి పూర్తి వైవిధ్యం ఉంటుంది. గూఢచారి పాత్ర ఎలాంటి గుర్తింపుని కోరుకోదు, తన ఉనికి గురించే బయట ప్రపంచానికి తెలీదు. మరో పాత్ర ప్రతి చిన్నదానికి పబ్లిసిటీని కోరుకుంటుంది. ఈ పాత్రలు రెండూ తెరపై చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ► నేను ఇప్పటివరకూ పని చేసిన నటుల్లో కార్తి ది బెస్ట్. తన పాత్ర పట్ల చాలా అంకిత భావంతో పని చేస్తారు. సినిమాకి ఉపయోగపడే చాలా ఆలోచలని పంచుకుంటారు. రాశి ఖన్నా , రజిషా విజయన్ పాత్రలు కథలో చాలా కీలకంగా ఉంటాయి. వారి పాత్రలని అద్భుతంగా చేశారు. అలాగే ఈ చిత్రంలో లైలా పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ► అఖిల్ తో ఒక సినిమా చేసే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. అయితే ప్రస్తుతానికి నా దృష్టి మాత్రం సర్దార్ విడుదల పైనే ఉంది.