Karthi Sardar Movie Telugu Distribution Rights To Nagarjuna - Sakshi
Sakshi News home page

Sardar Movie: నాగార్జున-కార్తీ కాంబినేషన్‌లో 'సర్ధార్‌'..

Published Tue, Jun 28 2022 8:42 AM | Last Updated on Tue, Jun 28 2022 9:44 AM

Karthi Sardar Movie Telugu Distribution Rights To Nagarjuna - Sakshi

Karthi Sardar Movie Telugu Distribution Rights To Nagarjuna: నాగార్జున–కార్తీ కాంబినేషన్‌లో ‘ఊపిరి’ తర్వాత మరో సినిమా రానుంది. ‘ఊపిరి’లో ఈ ఇద్దరూ నటించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం నటులుగా కాదు.. వీరి కాంబినేషన్‌ రిపీట్‌ కానున్నది నిర్మాత, హీరోగా. కార్తీ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘సర్దార్‌’ని తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై విడుదల చేయనున్నారు నాగార్జున. 

ఈ చిత్రం తెలుగు పంపిణీ హక్కులను సొంతం చేసుకున్న విషయాన్ని సోమవారం (జూన్‌ 27) ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ని తెలుగు, తమిళ భాషల్లో దీపావళికి రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి 'అభిమన్యుడు' ఫేమ్‌ పీఎస్‌ మిత్రాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సంగీతం జీవీ ప్రకాష్‌ కుమార్‌ అందిచగా, కెమెరా బాధ్యతలను జార్జ్‌ సి. విలియమ్స్‌ చేపట్టారు. 

చదవండి: హార్ట్‌ సింబల్స్‌తో సమంత ట్వీట్‌.. నెట్టింట వీడియో వైరల్‌..
నా ప్రతి అడుగులో అతను ఉన్నాడు: యంగ్‌ హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement