distribution rights
-
నాగార్జున-కార్తీ కాంబినేషన్లో 'సర్ధార్'..
Karthi Sardar Movie Telugu Distribution Rights To Nagarjuna: నాగార్జున–కార్తీ కాంబినేషన్లో ‘ఊపిరి’ తర్వాత మరో సినిమా రానుంది. ‘ఊపిరి’లో ఈ ఇద్దరూ నటించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం నటులుగా కాదు.. వీరి కాంబినేషన్ రిపీట్ కానున్నది నిర్మాత, హీరోగా. కార్తీ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘సర్దార్’ని తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై విడుదల చేయనున్నారు నాగార్జున. ఈ చిత్రం తెలుగు పంపిణీ హక్కులను సొంతం చేసుకున్న విషయాన్ని సోమవారం (జూన్ 27) ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ని తెలుగు, తమిళ భాషల్లో దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి 'అభిమన్యుడు' ఫేమ్ పీఎస్ మిత్రాన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సంగీతం జీవీ ప్రకాష్ కుమార్ అందిచగా, కెమెరా బాధ్యతలను జార్జ్ సి. విలియమ్స్ చేపట్టారు. చదవండి: హార్ట్ సింబల్స్‌తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్.. నా ప్రతి అడుగులో అతను ఉన్నాడు: యంగ్ హీరోయిన్ We are truly elated to be teaming up with @Prince_Pictures to distribute@Karthi_Offl 's Much awaited flick #Sardar in AP & TS 💥💥 WW Releasing this DIWALI 🧨🎇#SardarDiwali 💥@Psmithran @RaashiiKhanna_ @rajisha_vijayan @gvprakash @RedGiantMovies_ @lakku76 @ChunkyThePanday pic.twitter.com/jhQM4YI9Cb — Annapurna Studios (@AnnapurnaStdios) June 27, 2022 The Chaos will be 🔛 with his ARRIVAL ! @Karthi_Offl 's Most Awaited Film #Sardar AP & TS Distribution Rights Bagged by #AnnapurnaStudios 💥 WW Releasing this DIWALI 🧨🎇#SardarDiwali 💥@Psmithran @Prince_Pictures @RaashiiKhanna_ @rajisha_vijayan @gvprakash @RedGiantMovies_ pic.twitter.com/OwH14sbSDg — Annapurna Studios (@AnnapurnaStdios) June 27, 2022 -
స్పుత్నిక్–వి పంపిణీ హక్కులు ఎవరికీ ఇవ్వలేదు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో స్పుత్నిక్–వి వ్యాక్సిన్ బ్రాండ్ సంరక్షణ బాధ్యత తమ సంస్థకే ఉందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ స్పష్టం చేసింది. పంపిణీ హక్కులు ఏ కంపెనీకి అప్పగించలేదని శుక్రవారం వెల్లడించింది. తొలి 25 కోట్ల డోసుల పంపిణీ బాధ్యత తమదేనని తెలిపింది. ఈ మేరకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌తో (ఆర్డీఐఎఫ్) కలిసి డాక్టర్ రెడ్డీస్ సంయుక్త ప్రకటన వెలువరించింది. ‘జూన్ మధ్యలో స్పుత్నిక్–వి వ్యాక్సిన్ వాణిజ్యపరమైన విడుదల నేపథ్యంలో భాగస్వామ్యం కోసం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో నేరుగా చర్చిస్తున్నాం. వ్యాక్సిన్ కోసం పలు కంపెనీలు, థర్డ్ పార్టీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టుగా ఆధారాలు లేని నివేదికలు, వాదనలు కొన్ని రోజులుగా జరుగుతున్నాయి. నివాస సంఘాలకు వ్యాక్సిన్ సరఫరాకు ఏ కంపెనీతో మేము భాగస్వామ్యం కుదుర్చుకోలేదు. మా తరఫున వ్యాక్సిన్ సరఫరాకు ఎవరికీ బాధ్యతలు అప్పగించలేదు. అనధికార వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. కంపెనీ ప్రతినిధులమంటూ ఎవరైనా సంప్రదిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి. స్పుత్నిక్–వి పేరుతో మోసాలకు పాల్పడే వ్యక్తులపట్ల చట్టపరమైన చర్యలు తీసు కుంటున్నాం. అనధికార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు, నకిలీ ఉత్పత్తులకు కంపెనీ బాధ్యత వహించదు’ అని డాక్టర్ రెడ్డీస్ స్పష్టం చేసింది. -
ఆ వార్తల్లో నిజంలేదు
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఏ జీవీ ఆర్జీవీ ఫిల్మ్స్ సమర్పణలో రాకేష్ రెడ్డి–దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలవుతోంది. అయితే ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరో కొన్నారంటూ ఆన్లైన్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని, అవన్నీ కేవలం పుకార్లే అని నిర్మాతలు కొట్టిపారేశారు. ‘‘ఎవరికి, ఎంత ఖరీదుకి ఫైనల్ చేయబోతున్నారన్న వివరాలు రామ్‌గోపాల్ వర్మ, రాకేష్ రెడ్డిలు త్వరలోనే తెలియజేస్తారు. మా చిత్రాన్ని ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ‘‘మా సినిమా ట్రైలర్, ఓ పాటకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ స్పందన చూస్తుంటే సినిమా క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆర్జీవీ యూట్యూబ్ చానల్లోనే కోటిమందికిపైగా చూశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ‘నీ ఉనికి...’ పాటని 30 లక్షల మందికిపైగా చూశారు. వీటన్నిటినీ చూస్తుంటే మా సినిమాకి థియేటర్లలో జనాలు బ్రహ్మరథం పట్టడం ఖాయం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: రమ్మీ, సంగీతం: కళ్యాణ్ కోడూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సూర్య చౌదరి. -
న్యాయం చేయమంటే బెదిరిస్తున్నారు
‘‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రం కృష్ణా జిల్లా పంపిణీ హక్కులను కొని, నష్టపోయా. పవన్ కల్యాణ్ తర్వాతి చిత్రం ‘కాటమరాయుడు’ పంపిణీ హక్కులు ఇస్తామని చెప్పిన నిర్మాత శరత్ మరార్, పవన్ కల్యాణ్ మేనేజర్ శ్రీనివాస్ ఇప్పుడు స్పందించక పోగా, బెదిరిస్తున్నారు’’ అని డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘నేను పవన్ కల్యాణ్‌గారి అభిమాని. చిన్న సినిమాలు పంపిణీ చేసుకునే నేను ఆయన పై ఉన్న అభిమానంతో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ కృష్ణాజిల్లా హక్కులు కొనేందుకు రాగా, శరత్ మరార్‌గారు, శ్రీనివాస్‌గారు నాలుగు కోట్ల యాభై లక్షలు చెప్పారు. ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలకు కృష్ణా జిల్లాలో 3 కోట్ల 50 లక్షల షేర్ వచ్చింది, ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నారు, అందులో కొంచెం రికవరీ అమౌంట్ పెట్టమని చెప్పా. సినిమా బాగా వచ్చింది, హిట్ కొడతామనీ.. మన వద్ద రామ్‌చరణ్, సాయిధరమ్ తేజ్ చిత్రాలు కూడా ఉన్నాయని, ఏం భయం లేదనీ అన్నారు. ఆ మాటలు నమ్మి నాలుగు కోట్ల ముప్ఫైఎనిమిది లక్షలు (నాన్ రిటర్నింగ్ అమౌంట్) శరత్ మరార్‌కు ఇచ్చా. కృష్ణా జిల్లాలో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ టోటల్ షేర్ 2 కోట్ల 52 లక్షలు రాగా, కోటీ ఎనభై ఆరు లక్షల నష్టం వచ్చింది. సేమ్ బ్యానర్లో మరో చిత్రం చేసి, నష్టపోయిన బయ్యర్లకే పంపిణీ హక్కులిచ్చి న్యాయం చేస్తామని చెప్పి ‘కాటమరాయుడు’ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ‘ఇవ్వం’ అని, వేరే వారికి పంపిణీ హక్కులు ఇస్తున్నారు. ఈ విషయాన్ని పవన్‌గారి దృష్టికి తీసుకెళ్లి, న్యాయం చేయమని అడుగుదామనుకుంటే శరత్ మరార్, శ్రీనివాస్ నన్ను కలవనివ్వడం లేదు. ఫిల్మ్‌ఛాంబర్‌లో ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్ ‘నీ అంతు చూస్తాం’ అని బెదిరించాడు. నాకే కాదు, నైజాం డిస్ట్రిబ్యూటర్‌కు కూడా 8 కోట్ల నష్టం వచ్చింది. ఆయనకూ సినిమా ఇవ్వం అంటున్నారు. కల్యాణ్‌గారికి ఇవేవీ తెలియవు. తెలిసుంటే న్యాయం చేసేవారు. మీడియా ద్వారా ఆయన దృష్టికి వెళితే, నష్టపోయిన నాలాంటి వారికి న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు.