Heroine Laila Says I Still Call Srikanth As Kolabadda In Sardar Pre-Release Event - Sakshi
Sakshi News home page

హీరో శ్రీకాంత్‌ని ఇప్పటికీ ‘కొలబద్ద’అనే పిలుస్తా : లైలా

Published Thu, Oct 20 2022 10:38 AM | Last Updated on Thu, Oct 20 2022 11:42 AM

I still call Srikanth As Kolabadda, Heroine Laila Says - Sakshi

సీనియర్‌ హీరోయిన్‌ లైలా గురించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆప్పట్లో లైలాకు పెద్ద ఎత్తున ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండేది.  ఆమె కోసమే థియేటర్స్‌కి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. లైలాను తెలుగు తెరపై పరిచయం చేసింది ఎస్వీ కృష్ణారెడ్డి. 1997లొ ‘ఎగిరే పావురమా’ చిత్రంలో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది ఈ గోవా బ్యూటీ. ఈ సినిమాలో శ్రీకాంత్‌ హీరోగా నటించాడు. సినిమా మొత్తం హీరోని ‘కొలబద్ద’అంటూ ఆటపట్టిస్తుంది హీరోయిన్‌. పిల్లలతో పద్యం కూడా పాడిస్తుంది. ఈ సీన్‌ ఇప్పటికీ నవ్వులు పూయిస్తుంది. అయితే సినిమాలో మాదిరే బయట కూడా శ్రీకాంత్‌ని అలానే ఆటపట్టిస్తుందట లైలా.

ఇప్పటికీ శ్రీకాంత్‌ని ‘కొలబద్ద’అనే పిలుస్తుందట. 16 ఏళ్ల తర్వాత ‘సర్దార్‌’ ద్వారా మళ్లీ టాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు వస్తుంది లైలా. కార్తి హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె ఓ కీలక పాత్ర పోషించారు. అక్టోబర్‌ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా చిత్రబృందం తాజాగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న లైలాను స్టేజ్‌ మీదకు పిలుస్లూ..‘కొలబద్ద’ అని అన్నారు యాంకర్‌.

దీంతో లైలా  పగలబడి నవ్వింది. ఆ డైలాగ్‌ని గుర్తు చేస్తూ.. ఇప్పటికీ శ్రీకాంత్‌ని ఆ పేరుతోనే పిలుస్తానని చెప్పుకొచ్చింది. ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ సర్దార్ నాకు చాలా స్పెషల్ ఫిల్మ్, నేను నటించిన శివపుత్రుడు దీపావళి కి విదుదలై ఘన విజయం సాధించింది. సర్దార్ కూడా అదే రోజు వస్తోంది. దీపావళి నా పుట్టిన రోజు కూడా.   కార్తి గారు అద్భుతంగా నటించారు. మిత్రన్ గారు చాలా మంచి సినిమాని తీశారు. అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి’అని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement