కార్తీ హీరోగా, రాశీ ఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం సర్దార్. వాటర్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 21న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కార్తీ కెరీర్‌లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లతో బెస్ట్ మూవీగా నిలిచింది. టాలీవుడ్‌లోనూ భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రానికి సంబంధించిన తాజాగా ఓటీటీ రిలీజ్ అప్‌డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సంస్థ ఆహా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
(చదవండి: సర్దార్ హిట్.. దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్, ఫొటో వైరల్)
దాదాపు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న మూవీ ఈ నెలలోనే ఓటీటీలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ఆహా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆహాలో నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం మందించారు. ఈ చిత్రంలో రజీషా విజయన్, చుంకీ పాండే, లైలా కీలక పాత్రల్లో నటించారు.
అసలు కథేంటంటే: ‘ఒకానొక సమయంలో ఓ ఘోస్ట్ ఉండేది.. కానీ అది ఇక అబద్దం కాదు’ అనే దాన్ని బేస్ చేసుకుని, అలాంటి కాన్సెప్ట్ చుట్టూ తిరిగేలా ‘సర్దార్’ సినిమాను తెరకెక్కించారు. విజయ్ ప్రకాష్ (కార్తి) పబ్లిసిటీ తెచ్చుకోవాలని పాకులాడే ఓ పోలీస్ ఆఫీసర్. కనిపించకుండా పోయిన తన తండ్రి కారణంగా దేశ ద్రోహి కొడుకు అనే భారాన్ని మోస్తుంటాడు. తనని ఆ భయం వెంటాడుతుంటుంది. సమీర (లైలా) అనే సామాజిక కార్యకర్త నీటి వనరులను ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం సాగిస్తుంటుంది. విజయ్ ప్రకాష్ దేశాన్ని ప్రమాదంలో పడేసే అబద్ధాలు, మోసానికి సంబంధించిన ఇబ్బందికరమైన వెబ్‌కి సంబంధించి వివరాలను సేకరించటం కోసం హంతకులను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ప్రమాదకరమైన, దుష్టుడైన బిజినెస్ మేన్ రాథోడ్ (చుంకీ పాండే)ని, అతని నీచమైన ప్రణాళికలను ఆపగలిగే ఏకైక వ్యక్తి.. విజయ్ కార్తీక్ తండ్రి సూపర్ స్పై అజ్ఞాతంలో ఉంటాడు. అతను ఏం చేశాడనేదే సినిమా.' థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.
Comments
Please login to add a commentAdd a comment