
కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తోన్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. జిఏ2 పిక్చర్స్ పతాకంపై నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. సోమవారం కార్తికేయ పుట్టినరోజు కావటంతో జిఏ2 చిత్రనిర్మాతలు తమ హీరోని ఏం కావాలో కోరుకోమని సోషల్ మీడియా వేదికగా అడిగారు. దానికి స్పందించిన కార్తికేయ ‘నాకు టీజర్ ఇవ్వండి’ అన్నారు. వెంటనే స్పందించిన దర్శకుడు సర్‌ప్రైజ్ అంటూ కార్తికేయకు బర్త్‌డే గిఫ్ట్‌గా టీజర్‌ను అందించారు. ఈ సందర్భంగా ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ– ‘‘మా హీరో కార్తికేయ తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా మా సినిమాలో కనిపిస్తారు. దర్శకుడికి మొదటి సినిమా అయినా చెప్పిన పాయింట్‌ను చక్కగా తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment