ఆగ‌స్టు 2న ‘గుణ 369’ | Kartikeya Guna 369 Scheduled to Release Worldwide on August 2nd | Sakshi
Sakshi News home page

ఆగ‌స్టు 2న ‘గుణ 369’

Jul 4 2019 12:58 PM | Updated on Jul 4 2019 12:58 PM

Kartikeya Guna 369 Scheduled to Release Worldwide on August 2nd - Sakshi

‘ఆర్‌.ఎక్స్.100’ ఫేమ్ కార్తికేయ హీరోగా న‌టించిన  ‘గుణ 369’ ఆగ‌స్టు 2న విడుద‌ల కానుంది. అన‌ఘ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  శ్రీమ‌తి ప్రవీణ క‌డియాల స‌మ‌ర్పణలో స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నాయి. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు.

రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ సందర్భంగా చిత్ర స‌మ‌ర్పకురాలు ప్రవీణ క‌డియాల మాట్లాడుతూ గుణ 369 టీజ‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. సినిమా త‌ప్పకుండా ప్రేక్షకులకు న‌చ్చుతుంద‌నే న‌మ్మకం ఉంది’ అని అన్నారు.

ద‌ర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ ‘తెలుగులో మంచి క‌థ‌ల‌తో సినిమా రావ‌ట్లేద‌ని చాలా మంది అంటుంటారు. మా గుణ 369 చూసిన త‌ర్వాత ఇంకెప్పుడూ ఎవ‌రూ అలాంటి మాట‌లు అన‌రు. అంత‌గా అన్నీ జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని చేశాం. పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నుల‌ను కూడా అప్రమ‌త్తంగా చేస్తున్నాం’ అని చెప్పారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ ‘యువ‌త‌కు కావాల్సిన అంశాలు, ఫ్యామిలీ కోరుకునే విష‌యాలు, మాస్ ప్రేక్షకుల‌ను న‌చ్చే స‌న్నివేశాలతో మేం నిర్మించిన చిత్రం గుణ 369. షూటింగ్ పూర్తయింది. నిర్మాణానంత‌ర కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. త్వర‌లోనే పాట‌ల‌ను, ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి, ఆగ‌స్టు 2న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావ‌డానికి స‌ర్వం సిద్ధం చేస్తున్నాం. ఇప్పటిదాకా వ‌చ్చిన ఔట్‌పుట్ చాలా బావుంది. ప్రేక్షకుల‌కు అన్నివిధాలా న‌చ్చుతుంద‌ని న‌మ్మకం క‌లిగింద’న్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement