![Anagha to make her Telugu debut with Karthikeya 'Guna 369 - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/30/Anagha.jpg.webp?itok=Tf_hjI1z)
అనఘ
మాలీవుడ్ నుంచి మరో భామ టాలీవుడ్ తలుపు తట్టారు. కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మించిన సినిమా ‘గుణ 369’. ఈ సినిమాలోకి అనఘను కథానాయికగా తీసుకున్నట్లు చిత్రబృందం వెల్లడించారు. ‘‘తమిళ చిత్రం ‘నట్పే తునై’లో అనఘ నటించారు. ఆ సినిమాలోని కొన్ని సీన్లు చూసి ‘గుణ 369’ చిత్రంలో కథానాయికగా ఎంపిక చేసుకున్నాం. అనుఘ కూడా టాప్ రేంజ్‌కి వెళ్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు అర్జున్. కార్తికేయ, అనఘ జోడీ బాగుంది. ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఆమె స్టార్ మెటీరియల్ అని నా నమ్మకం. అనఘ స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో డ్యాన్సుల విషయంలోనూ బాగా హెల్ప్ అయ్యింది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాతలు. ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment