
నస్లేన్, మమిత, రాజమౌళి, కార్తికేయ, అనిల్
ఎస్‌ఎస్ రాజమౌళి
‘‘సాధారణంగా నేను ప్రేమకథలు, రొమాంటిక్ కామెడీ చిత్రాలను ఇష్టపడను. నాదంతా యాక్షన్, ఫైట్స్ స్టైల్. మలయాళ ‘ప్రేమలు’ సినిమా బాగుంది.. తెలుగులో రిలీజ్ చేస్తున్నాన ంటూ మా అబ్బాయి కార్తికేయ చెప్పడంతో.. ఏదో ఉత్సాహపడుతున్నాడులే అనుకున్నాను. సినిమాకి వెళ్లాక తొలి పదిహేను నిమిషాల తర్వాతి నుంచి చివరి వరకూ నవ్వుతూనే ఉన్నాను’’ అన్నారు ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి. నస్లేన్ కె. గఫూర్, మమిత బైజు, శ్యామ్ మోహన్ , మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమలు’.
మలయాళంలో హిట్‌గా నిలిచిన ఈ మూవీని ఎస్‌ఎస్ కార్తికేయ ఈ నెల 8న తెలుగులో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సక్సెస్‌మీట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్‌ఎస్ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘ప్రేమలు’ మూవీకి డైలాగులను అద్భుతంగా రాశాడు ఆదిత్య. కొంచెం అసూయ, కొంచెం బాధతో ఈ మాటను ఒప్పుకోవాలి. మలయాళ నటీనటులందరూ చాలా బాగా యాక్ట్ చేస్తారు. ‘ప్రేమలు’లోని నటీనటులు అద్భుతంగా నటించారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి, దర్శకులు అనిల్ రావిపూడి, అనుదీప్ కూడా మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment