Karthikeya- Lohitha Wedding Card: ఆర్ఎక్స్ 100 సినిమాతో బాక్సాఫీస్ దద్దరిల్లేలా చేశాడు యంగ్ హీరో కార్తికేయ. ఒక్క హిట్టుతో బోలెడన్ని అవకాశాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. దీంతో వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్‌లో దూసుకుపోతున్నాడీ హీరో. అటు పర్సనల్ లైఫ్‌లోనూ హుషారు మీదున్నాడు కార్తికేయ. త్వరలోనే తను ప్రేమించిన అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేసి ఆమెను తన అర్ధాంగిగా మార్చుకోనున్నాడు. 'రాజా విక్రమార్క' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో కాబోయే భార్య లోహితకు ప్రపోజ్ చేసి ఆమెను అందరికీ పరిచయం చేశాడు.
ఈ క్రమంలో ఎంతో గ్రాండ్‌గా నిశ్చితార్థం జరుపుకున్న కార్తికేయ పెళ్లికి మంచి ముహూర్తం ఫిక్స్ చేశారట! ఈ నెల 21న ఉదయం 9 గంటల 47 నిమిషాలకు హీరో తన ఇష్టసఖి మెడలో మూడు ముళ్లు వేయనున్నాడట! ఈ మేరకు కార్తికేయ-లోహితల పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వేడుకకు ఆయన బంధుమిత్రులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
కాగా కార్తికేయ లవ్ స్టోరీతో సినిమా తీయొచ్చు. 2010లో మొట్టమొదటిసారి లోహితను కలిసిన ఈ హీరో 2012లో ప్రపోజ్ చేశాడు. కానీ హీరో అయ్యాకే మీ ఇంటికి వచ్చి మాట్లాడతానని చెప్పాడు. హీరో అవ్వడానికి ఎంత కష్టపడ్డాడో తన ప్రేమను గెలిపించుకోవడానికీ అంతే కష్టపడ్డాడు. ఫైనల్‌గా యూత్ హీరోగా నిలదొక్కుకున్నాక పెద్దలను ఒప్పించి ఆమెను పెళ్లాడబోతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment