90 ఎంఎల్‌ కహానీ ఏంటి? | karthikeya gummakonda 90 ml first look release | Sakshi
Sakshi News home page

90 ఎంఎల్‌ కహానీ ఏంటి?

Published Tue, Sep 10 2019 6:20 AM | Last Updated on Tue, Sep 10 2019 6:20 AM

karthikeya gummakonda 90 ml first look release - Sakshi

కార్తికేయ

‘90 ఎంఎల్‌’ ఈ కొలమానం మందుబాబులకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు ‘90 ఎంఎల్‌’ అనే ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌తో కార్తికేయ ఓ సినిమా చేస్తున్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రాన్ని నిర్మించిన అశోక్‌ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్నారు. శేఖర్‌ రెడ్డి ఎర్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నేహా సోలంకి కథానాయిక. ‘90 ఎంఎల్‌’ సినిమా గురించి అశోక్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘మంచి సినిమా తీస్తే ఇండస్ట్రీలో గుర్తింపు, గౌరవం ఎలా ఉంటుందో, బాక్సాఫీస్‌ కలె„ý న్లు ఎలా ఉంటాయో ‘ఆర్‌ఎక్స్‌ 100’ ద్వారా తెలిసింది. ఆ సినిమాతో కార్తికేయకు మంచి బ్రేక్‌ వచ్చింది. ‘90 ఎంఎల్‌’ సినిమా 70 శాతం షూటింగ్‌ పూర్తయింది’’ అన్నారు. ‘‘ఈ టైటిల్‌ ఎందుకు పెట్టాం? అనే విషయం సిల్వర్‌ స్క్రీన్‌ మీద చూస్తే బావుంటుంది. 2 పాటలు, కొంత టాకీ, క్లైమాక్స్‌ మినహా షూటింగ్‌ పూర్తయింది’’ అన్నారు శేఖర్‌రెడ్డి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement