ఆకట్టుకుంటున్న అజిత్‌ ‘వాలిమై’ మూవీ ట్రైలర్‌ | Ajith Kumar And Karthikeya Valimai Movie Trailer Released | Sakshi
Sakshi News home page

Ajith Kumar: ఆకట్టుకుంటున్న అజిత్‌ కుమార్‌ ‘వాలిమై’ మూవీ ట్రైలర్‌

Published Thu, Dec 30 2021 7:45 PM | Last Updated on Thu, Dec 30 2021 8:25 PM

Ajith Kumar And Karthikeya Valimai Movie Trailer Released - Sakshi

తమిళ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌ తాజాగా నటిస్తున్న చిత్రం వాలిమై.  హెచ్‌ వినోద్‌ దర్శకత్వంతో వహిస్తున్న ఈ మూవీలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ విలన్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. చాలా గ్యాప్‌ తర్వాత అజిత్‌ ఈ మూవీ ప్రకటించడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం అటూ కోలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అజిత్‌ తెలుగు ఆడియన్స్‌ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి ఆసక్తికర అప్‌డేట్‌ వదిలారు మేకర్స్‌. న్యూయర్‌ సందర్భంగా ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తూ వాలిమై ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. 

చదవండి: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోన్న శ్యామ్‌ సింగరాయ్‌!, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

ట్రైలర్ విషయానికి వస్తే.. మొదటి నుంచి చివరి వరకు ఆసక్తిగా పెంచుతోంది ఈ ట్రైలర్‌.  ముఖ్యంగా అజిత్, కార్తికేయ బైక్ స్టంట్స్ ఫ్యాన్స్‌ చేత ఈళలు వేయించేలా ఉంది. ఇక యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు స్పెషల్‌ అట్రాక్షన్‌గా చెప్పకోవచ్చు. కాగా బోణీ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ హుమా కురేషి కీలక పాత్ర పోషిస్తోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈమూవీ సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, కన్నడ భాషల్లో కూడా ఈ మూవీని డబ్ చేయనున్నారు. 

చదవండి: మారక తప్పదంటూ దీప్తి పోస్ట్‌, షణ్నూతో బ్రేకప్‌ తప్పదా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement