
‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా నటించారు. ఆదిరెడ్డి. టి సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘88’ రామారెడ్డి మాట్లాడుతూ – ‘‘యాక్షన్, కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది.
కార్తికేయ లేకుండా ఈ సినిమాను ఊహించలేం. ఏజెంట్ విక్రమ్ పాత్రలో ఆయన జీవించారు. శ్రీ సరిపల్లికి తొలి సినిమా అయినా బాగా తీశాడు’’ అన్నారు. శ్రీ సరిపల్లి మాట్లాడుతూ– ‘‘ఎన్‌ఐఏ ఏజెంట్ విక్రమ్ పాత్రలో కార్తికేయ కొత్తగా కనిపిస్తారు. న్యూ ఏజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో కార్తికేయ లుక్ బాగుంటుంది. స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment