
వరుణ్ తేజ్ పినికాశి
‘ఎన్నో ఆశలు, ఆశయాలతో సినిమా రంగంలోకి వచ్చే నటీనటులు, సాంకేతిక నిపుణులను కొంత మంది అవకాశాల పేరిట ఎలా మోసాలు చేస్తున్నారు? ఎలా మోసపోతున్నారు?’ అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ద ఫిలిం డైరక్టర్ 8500400789’. వరుణ్ తేజ్ పినికాశి టైటిల్ రోల్‌లో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. మేఘనా చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. ఫిలిం రిక్రూట్‌మెంట్ సర్వీసెస్ పతాకంపై పి.నాగలక్ష్మి నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పి.నాగలక్ష్మి మాట్లాడుతూ– ‘‘సినిమా నేపథ్యంలో జరిగే కథాంశమిది.
ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్‌లో జరుగుతున్న మోసాలను చూపిస్తున్నాం. మోసం చేసే వ్యక్తుల నుంచి తప్పించుకుని చివరకు మా డైరెక్టర్ ఎలా సినిమా తీశాడు? దాన్ని ఏ విధంగా రిలీజ్ చేశాడు? అన్నది ఆసక్తిగా ఉంటుంది. ఇందులో కామెడీ, ప్రేమకథ ఉంటుంది. ఇటీవల మార్షల్ ఆర్ట్స్‌లో గోల్డ్ మెడల్ అందుకున్న వరుణ్ తేజ్ పినికాశి చేతులపై కార్లు ఎక్కించుకునే సన్నివేశంలో నటించేందుకు శిక్షణ తీసుకుంటున్నారు’’ అన్నారు. జీవా, జ్యోతితో పాటు పలువురు కొత్తవారు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: పూర్ణచంద్ర భైరి, కెమెరా: బాలకిషన్.
Comments
Please login to add a commentAdd a comment