
ఆత్మాభిమానం గల ఓ యువతి తనకు జరిగిన అవమానానికి తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘స్వయంవద’. అనికా రావు, ఆదిత్య అల్లూరి జంటగా వివేక్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది. లక్ష్మీ చలనచిత్ర పతాకంపై రాజా దూర్వాసుల నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా వివేక్ వర్మ మాట్లాడుతూ– ‘‘అహం దెబ్బ తిన్న అమ్మాయి కథ ఇది. అవమానిస్తే స్వాభిమానం గల యువతి ఎలా తిరగబడుతుంది? అలాంటి పరిస్థితిలో యువతి భావోద్వేగాలు ఎలా ఉంటాయి? అని ఆకట్టుకునేలా తెరకెక్కించాం.
జానపథ కథల్లోని ఓ అందమైన యువతి పాత్రను నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రం తీశాం. ఆరు విభిన్న ఛాయలతో నాయిక పాత్ర సాగుతుంది. ‘స్వయంవద’ టైటిల్‌కి మంచి స్పందన వచ్చింది. ట్రైలర్, టీజర్, పాటలు బాగున్నాయి అంటున్నారు. కొన్నేళ్ల క్రితమే హారర్ కథతో సినిమా చేద్దామనుకున్నాను. నిర్మాతలు సహకరించలేదు. తర్వాత దాదాపు అలాంటి కథతోనే నయనతార నటించిన కొన్ని హారర్ చిత్రాలు వచ్చాయి. హారర్ అంశాలు మాత్రమే ఉంటే ప్రేక్షకులను ఆకట్టుకోలేమని థ్రిల్లర్, కామెడీ, యాక్షన్ లాంటి అంశాలను చేర్చాం. పోసానిగారు వెంకట్రాముడు అనే మంచి పాత్రలో నటించారు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేణు మురళీధర్.వి, సంగీతం: రమణ.జీవి.
Comments
Please login to add a commentAdd a comment