
కిరణ్ అబ్బవరం
‘రాజావారు రాణివారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా, ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. శ్రీధర్ గదె ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఎలైన్ ఎంటర్‌టైన్మెంట్స్ ప్రొడక్షన్స్‌లో వస్తోన్న తొలి చిత్రం ఇది. ఈ చిత్రం ముçహూర్తపు సన్నివేశానికి రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా క్లాప్ ఇచ్చారు. ప్రముఖ నటుడు సాయికుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు. తులసి, శ్రీకాంత్, కశ్యప్ శ్రీనివాస్, అరుణ్ నటిస్తున్న ఈ సినిమాకు ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ చేతన్ భరద్వాజ్ స్వరకర్త.