
కృష్ణ చంద్ర, కారోణ్య కట్రీన్
కృష్ణ చంద్ర, కారోణ్య కట్రీన్ జంటగా మురళి బోడపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు మీ శ్రీమతి’. హంస వాహిని టాకీస్ పతాకంపై ఎమ్.ఎస్. రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి.ప్రసన్న కుమార్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వి. సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత దామోదర్ ప్రసాద్ క్లాప్ ఇచ్చారు. ఎమ్.ఎస్. రెడ్డి మాట్లాడుతూ– ‘‘వినోదభరితమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. మురళి బోడపాటి చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా నిర్మిస్తున్నా.
కృష్ణచంద్ర ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. నిర్మాత డి.ఎస్. రావ్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు’’ అన్నారు. ‘‘అక్టోబర్ మొదటి వారంలో మా సినిమా రెగ్యులర్ షూటింగ్ విజయవాడలో ప్రారంభం కానుంది. 35 రోజులు జరిగే ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది’’ అన్నారు మురళి బోడపాటి. ‘‘ఈ సినిమాలో నా పోలీస్ పాత్ర గుర్తుండిపోతుంది’’ అన్నారు డి.ఎస్. రావ్. ‘‘ఇందులో మంచి కథ, కథ నాలున్నాయి’’ అన్నారు కృష్ణచంద్ర. కారోణ్య కట్రీన్ పాల్గొన్నారు. ఈ సినిమాకి సంగీతం: వెంగీ, కెమెరా: తోట.వి.రమణ.
Comments
Please login to add a commentAdd a comment