
రవి నాయక్, మనికాంత్, నర్సింహ్మ గౌడ్
‘తీరం, క్రియేటివ్ క్రిమినల్’ వంటి సినిమాలు నిర్మించిన కౌడిన్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తాజాగా తెరకెక్కుతోన్న మూడో సినిమా ‘సమాజం’. మనికాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి ఎమ్. రవినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. నర్సింహ్మ గౌడ్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నర్సింహ్మ గౌడ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎమ్. రవి నాయక్ క్లాప్ కొట్టారు. ‘‘ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. నవంబర్ మూడో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి రెండు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తి చేయనున్నాం’’ చిత్ర బృంధం పేర్కొంది. ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ: అళహరి.
Comments
Please login to add a commentAdd a comment