
‘ధమాకా!’ (2022) సినిమాలో తొలిసారి జంటగా నటించి ప్రేక్షకులను మెప్పించారు రవితేజ, శ్రీలీల.

తాజాగా ఈ జోడీ రిపీట్ అయింది. మంగళవారం నాడు ఈ సినిమా షూటింగ్‌ను పూజా కార్యక్రమంతో ప్రారంభించారు.

భాను భోగవరపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. తెలంగాణ నేపథ్యంలో సాగే చిత్రంగా ఇది తెరకెక్కనుంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. 2025 సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.



