‘రౌడీ బాయ్స్’ ఫేమ్ ఆశిష్ హీరోగా మూడో చిత్రం సోమవారం ఆరంభమైంది. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శిరీష్ సమర్పణలో ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగార్జున మల్లిడి నిర్మిస్తున్నారు. ‘‘రొమాంటిక్ హారర్ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమిది.
‘రౌడీ బాయ్స్’తో తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఆశిష్ ప్రస్తుతం నటిస్తున్న ‘సెల్ఫిష్’ 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. మూడో సినిమాగా రూ΄పొందుతున్న ఈ రొమాంటిక్ హారర్ లవ్ స్టోరీ కోసం ఇండస్ట్రీలోని టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు’’ అన్నారు మేకర్స్. ఈ సినిమా ప్రారంభోత్సవానికి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు చినబాబు, నాగవంశీ తదితరులు హాజరయ్యారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం. కీరవాణి, కెమెరా: పీసీ శ్రీరామ్.
Comments
Please login to add a commentAdd a comment