
దిగంగనా సూర్యవన్షీ, లక్ష్
లక్ష్, దిగంగనా సూర్యవన్షీ హీరోహీరోయిన్లుగా రమేశ్ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ఇంతకుముందు ఈ బ్యానర్‌పై ‘బిచ్చగాడు’, ‘డి 16’, ‘టిక్..టిక్..టిక్’ వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజా చిత్రం చిత్రీకరణ త్వరలోనే మొదలు కానుంది. రవి ప్రకాశ్, రవి వర్మ, నోయల్ సేన్, చిత్రం శీను, కృష్ణేశ్వర్ రావ్, రామకృష్ణ, శరత్ తదితరులు నటించనున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తారు. ఈ చిత్రానికి రామకృష్ణ ఛాయాగ్రహకుడు.
Comments
Please login to add a commentAdd a comment