అదృష్టం వచ్చేలోపే ఆపద | samudrudu movie opening in hyderabad | Sakshi
Sakshi News home page

అదృష్టం వచ్చేలోపే ఆపద

Published Sat, Aug 17 2019 12:36 AM | Last Updated on Sat, Aug 17 2019 12:36 AM

samudrudu movie opening in hyderabad - Sakshi

మోనల్, రమాకాంత్, సిమర్‌

రమాకాంత్‌ హీరోగా మోనల్, సిమర్‌ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘సముద్రుడు’. కీర్తన ప్రొడక్షన్స్‌ పతాకంపై బాదావత్‌ కిషన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు నగేష్‌ నారదాశి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీరామోజీ జ్ఞానేశ్వర్, పి. రామారావు, సోములు సహ–నిర్మాతలు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు రమేష్‌ వర్మ క్లాప్‌ ఇచ్చారు. దర్శకుడు సముద్ర గౌరవ దర్శకత్వం వహించగా నిర్మాత ముత్యాల రామదాసు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. మల్టీడైమెన్షన్‌ వాసు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా దర్శకుడు నగేష్‌ మాట్లాడుతూ– ‘‘ప్రాణాలతో నిత్యం చెలగాటాలాడుతూ కష్టాలు అనుభవిస్తున్న జాలర్లకు అదృష్టం రాబోయే సమయంలో ఓ ఆపద వస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలతో సినిమా సాగుతుంది’’ అని అన్నారు. ‘‘అన్ని రకాల ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేస్తున్నాం. స్క్రిప్ట్‌ కోసం నగేష్‌ ఆరునెలలు కష్టపడ్డారు’’ అన్నారు రమాకాంత్‌. ‘‘ఇదివరకు నగేష్‌తో ‘శ్రీసత్యన్నారాయణ వ్రతం’ అనే సినిమా చేశాను. ఈ సినిమాలో పోలీసాఫీసర్‌ పాత్ర చేస్తున్నా’’ అన్నారు సుమన్‌. ‘‘ఎన్‌ఆర్‌ఐ పాత్ర చేస్తున్నా’’ అన్నారు మోనల్‌. ‘‘టీచర్‌ రోల్‌లో కనిపిస్తా’’ అన్నారు సిమర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement