
తిలక్ శేఖర్, ఖ్యాతి శర్మ జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘ఫాలోయింగ్’. విస్లా స్టూడియోస్ పతాకంపై ప్రవీణ్ సాపిరెడ్డి నిర్మించనున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గౌరీదేవి సాపిరెడ్డి క్లాప్ ఇవ్వగా, రాధికా చిలకలపూడి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ప్రవీణ్ సాపిరెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇలాంటి మంచి ప్రాజెక్ట్‌తో ఇండస్ట్రీకి పరిచయం కావాలని వేచిచూశాను.
మా బాబాయ్ ఛోటా కె.నాయుడుగారు కథ విని చాలా బాగుందని ప్రోత్సహించారు’’ అన్నారు. ‘‘నేను కన్నడలో 12 చిత్రాల్లో హీరోగా నటించాను. తెలుగులో ‘త్రిపుర’ లో నెగెటివ్ రోల్ చేశాను. ఆ తర్వాత నేను చేస్తున్న చిత్రం ‘ఫాలోయింగ్’’ అన్నారు తిలక్ శేఖర్. ‘‘2021 మార్చి 11న శివరాత్రి సందర్భంగా ఈ సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు రాధాకృష్ణ. ఖ్యాతి శర్మ, కెమెరామెన్ నిమ్మ గోపి, మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ మాణిక్, ప్రమోద్ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment