
నాగశౌర్య, రీతూవర్మ
‘అశ్వథ్థామ’ విజయంతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు నాగశౌర్య. తాజాగా ఓ కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నూతన దర్శకురాలు లక్ష్మీ సౌజన్య ఈ సినిమా తెరకెక్కించనున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం గురువారం జరిగింది. ఈ నెల 19న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ సినిమాకు కెమెరా: వంశీ పచ్చి పులుసుల, సంగీతం: విశాల్ చంద్రశేఖర్.
Comments
Please login to add a commentAdd a comment