
రవితేజ హీరోగా ‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖిలాడి’ చిత్రం షురూ అయింది. ‘ప్లే స్మార్ట్’ (తెలివిగా ఆడు) అనేది ఉపశీర్షిక. డాక్టర్ జయంతీలాల్ గడ (పెన్ ) సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఐ. శ్రీనివాసరాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో హవీష్ క్లాప్ ఇచ్చారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కథానాయికలు. సత్యనారాయణ కోనేరు మాట్లాడుతూ– ‘‘ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
ఉన్నత స్థాయి సాంకేతిక విలువలతో రమేష్ వర్మ ఈ చిత్రాన్ని ఆద్యంతం ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దుతున్నారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ‘లూసిఫర్’ ఫేమ్ సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్, ఫైట్ మాస్టర్లు రామ్–లక్ష్మణ్ వంటి టెక్నీషియన్లతో పర్‌ఫెక్ట్ టీమ్‌తో సినిమా చేస్తున్నాం. నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ‘ఖిలాడి’ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది’’ అన్నారు. ఈ చిత్రానికి బ్యానర్లు: ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్, ప్రొడక్షన్స్: హవీష్ ప్రొడక్షన్స్ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ కొడాలి.
Comments
Please login to add a commentAdd a comment